తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్నటువంటి సినిమా అన్నాత్తే శివ దర్శకత్వంలో,సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఇకపోతే కీర్తి సురేష్ ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలు పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అన్నాత్తే సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తమ అభిమాన హీరో సినిమా నుంచి ఈ అప్డేట్ తెలియడంతో తలైవా అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా పనులను శరవేగంగా పూర్తి చేసుకొని ఈ సినిమాను నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ డీ ఇమ్మాన్ సౌండ్ ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వం వహించే సినిమాలో నటించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయితే రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి కావడం వల్ల ఈ సినిమా తరువాత సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి.అయితే రజనీకాంత్ తన తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే విషయాల గురించి రజనీకాంత్ కాంపౌండ్ నుంచి అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.