టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.
నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్ పై తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడని టాక్.ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్య కృష్ణ నటిస్తుండగా.నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి కన్ఫర్మ్ అయ్యింది.తండ్రి కొడుకులు కలిసి నటించడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది.సోగ్గాడే చిన్ని నాయన సినిమా కూడా అప్పట్లో సంక్రాంతికి విడుదల చేసారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది.అయితే ఈ సెంటిమెంట్ ను బంగార్రాజు విషయంలో కూడా పాటిస్తున్నట్టు తెలుస్తుంది.
అందుకే బంగార్రాజు సినిమాను కూడా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే బరిలోకి దింపాలని అనుకుంటున్నారట.
ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ అయినా ఈ సినిమాను వైరం లేకుండా పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తుంది.అంతేకాకుండా అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.ఇప్పటికే సంక్రాంతి రేస్ లో పెద్ద పెద్ద సినిమాలు ఉండడం వల్ల ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తే పోటీ విపరీతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.
మరి చూడాలి పెద్ద సినిమాలకు పోటీగా నిలబెడతారో.లేదంటే చివరి నిముషంలో వెనక్కి వెళ్తారో.