టూత్ పేస్ట్ లో వివిధ రంగులలో ఎందుకు ఉంటాయో తెలుసా..?!

ప్రతి రోజూ మనం పొద్దునే లేవగానే చేసే మొదటి పని టూత్‌ పేస్టుతో దంతాలను శుభ్రం చేసుకోవడమే.పొద్దునే బ్రష్ చేసిన తరువాతనే ఏ పని అయిన మొదలుపెడతాం.

 Do You Know Why Toothpaste Comes In Different Colors Toothpaste, Colours, Red A-TeluguStop.com

అయితే ఈ క్రమంలో మార్కెట్లోకి రకరకాల టూత్ పేస్టులు వచ్చేసాయి.కోల్గేట్‌, మిస్‌వాక్‌, డాబర్‌, ఆయుష్, సెన్సోడెంట్, హిమాలయ అని రకరకాల టూత్‌ పేస్టులు కూడా వచ్చేసాయి.

అయితే ప్రతిరోజు మనం వాడే టూత్‌ పేస్టును ఎప్పుడన్నా మీరు గమనించారా ? టూత్‌ పేస్టు ట్యూబ్‌ చివరన మూడు రంగులు కనిపిస్తుంటాయి ఎప్పుడన్నా వాటిని మీరు చూసారా ? అవి ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులలో ఉంటాయి.ఒకసారి మీ టూత్ పేస్ట్ ను మీరు గమనించండి.

అసలు టూత్ పేస్ట్ చివరన ఆ రంగులు ఎందుకు ఉంటాయో అనే విషయం మీకు తెలుసా.

ఈ రంగుల వెనుక ఉన్న అర్ధం ఏంటంటే ఇవి టూత్ పేస్ట్ నాణ్యతను తెలియజేస్తాయని కొంతమంది భావిస్తారు.

కలర్‌ కోడింగ్‌ ద్వారా టూత్ పేస్టు పూర్తిగా రసాయనంతో తయారు చేయబడిందా లేదంటే సహాజమైన రసాయనాలతో తయారు చేయబడినదా అని తెలుసుకోవడానికి ఈ రంగులు ఉంటాయని పలువురు అనుకుంటారు.కానీ అది యదార్ధం కాదట.

కోల్గేట్‌ అధికారిక వెబ్‌ సైట్‌ కధనం ప్రకారంఈ రంగులకు టూత్ పేస్ట్ నాణ్యతకు ఎలాంటి రిలేషన్ లేదు.ఈ కలర్‌ కోడింగ్‌ ఉండడం వలన వాటి ప్యాకింగ్ సులువుగా అవుతుందని అంటున్నారు.

అంటే ఈ కలర్ కోడ్ యంత్రాలకు సహాయపడతాయి.అది ఎలా అంటే టూత్‌ పేస్టు తయారు చేసేటప్పుడు ముందు వెనుక భాగాలు గుర్తించే క్రమంలో వెనుక వైపున గుర్తుగా ఈ రంగులను వాడుతుంటారు.

నిజానికి ట్యూట్‌ మేకింగ్‌ మెషీన్‌ లైట్‌ సెన్సార్‌ అనేది ఈ గుర్తును గుర్తించడం వలనే అది టూత్‌ పేస్ట్‌ వెనుక భాగంలో సీల్‌ వేసేస్తుంది.

Telugu Colours, Difference, Benefits, Care, Red Green, Toothpaste-Latest News -

అందుకే అక్కడ కలర్స్ ఉంచుతారట.కేవలం ఎరుపు, ఆకు పచ్చ, నీలం రంగులే కాకుండా వేరే రంగులను కూడా టూత్ పేస్ట్ చివరన మనకు కనిపిస్తాయి.ఈ రంగులను బట్టి యంత్రం ఎంత మడతపెట్టాలి ఏంటి అనేది మెషిన్ నిర్ధారిస్తుంది.

ఇందు కోసమే ఈ రంగులను ఉపయోగిస్తుంటారు తప్పా టూత్ పేస్ట్ నాణ్యత గురించి మాత్రం అయితే కాదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube