బుల్లితెర కింగ్ సుడిగాలి సుధీర్.. ప్రూఫ్ ఇదిగో

బుల్లితెరలో సుడిగాలి సుధీర్ రేంజ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ స్టార్ హీరోలకున్నంత ఫాలోయింగ్ సుడిగాలి సుధీర్ కు ఉంది.

 Sudigali Sudheer Tops The List Of Ormax Most Popular Non Fiction Personalities-TeluguStop.com

అతి తక్కువ సమయంలో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.

ఇక ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన పాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర కింగ్ గా కూడా నిలిచాడు.

కెరీర్ మొదట్లో మ్యాజిక్ చేస్తూ ఉండే సుధీర్ కు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో అవకాశం రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయాడు.నిజానికి జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా నిలిచాడు.

ఇందులోనే ఉండగానే వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.హీరోగా కూడా నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

Telugu Hyper Adhi, Jabardasth, Naga Babu, Pova Pora, Sridevidrama, Suma-Movie

ఇక కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పోవే పోరా అనే షోలో యాంకరింగ్ చేసి యువతను ఆకట్టుకున్నాడు.ఇక ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా పని చేస్తున్నాడు.ఇక ఈ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా యాంకర్ గా చేస్తున్నాడు.ఇలా వరుసగా షో లలో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన సమయాన్ని గడుపుతాడు.

Telugu Hyper Adhi, Jabardasth, Naga Babu, Pova Pora, Sridevidrama, Suma-Movie

ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరలో ప్రసారమౌతున్న షోలలో యాంకర్లకు, జడ్జిలకు సోషల్ మీడియాలో తమకు ఉన్న ఫాలోయింగ్ బట్టి ఓ సర్వేను చేశారు.అందులో ఐదుగురిని సెలెక్ట్ చేయగా టాప్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ నిలిచాడు.ఆ తర్వాత హైపర్ ఆది, ఓంకార్, సుమ, నాగబాబు ఉండగా ఎన్నో ఏళ్ళనుండి ఉంటున్న వీరికంటే అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube