సినిమా అనేది రంగుల ప్రపంచం.నటీనటుల జీవితాలూ అంతే.
ప్రేమలు, పెళ్లిళ్లు, అఫైర్లు, సహజీవనాలు అన్నీ కామన్.నచ్చితే కలిసి ఉంటారు.
లేదంటే.విడిపోతారు.
ఇబ్బందులు పడుతూ కలిసి ఉండటం కంటే.విడిపోయి సుఖంగా ఉండటమే మంచిది అనుకుంటారు చాలా మంది తారలు.
అందుకే పెళ్లి చేసుకున్న కొంత కాలానికే విడిపోవడం చూస్తుంటాం.అయితే.
కొంత మంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నా.వారి వివాహ బంధం చాలా కాలం కొనసాగలేదు.కొద్ది కాలానికే విడిపోయారు.మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం కొనసాగిస్తున్నారు.ఇంతకీ తొలి మ్యారేజ్ లో విఫలమైన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
*
భానుప్రియ
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది భానుప్రియ.1998లో ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకుంది.2003లో వీరికి ఓ బాబు పుట్టాడు.2005లో వీరిద్దరు విడిపోయాడు.2018లో కౌశల్ చనిపోయాడు.
*అమలాపాల్
ప్రముఖ నటి అమలా పాల్, దర్శకుడు విజయ్ 2014 లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.2017లో వీరిద్దరు విడిపోయారు.కొద్ది రోజుల క్రితం అమలాపాల్ మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు వాస్తవమా? కాదా? అనే అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
*కరిష్మా కపూర్
2003లో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ ని ప్రేమ వివాహం చేసుకుంది.2016లో వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు.
*రజని
అలనాటి మేటి నటి రజని 1998లో డాక్టర్ ప్రవీణ్ ను పెళ్లి చేసుకుంది.2008లో అనివార్య కారణాల మూలంగా ఇద్దరూ విడిపోయారు.
*సారిక
సారిక, కమల్ హాసన్ కు 1988లో వివాహం అయ్యింది.వీరిద్దరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ పెళ్లి చేసుకున్నారు.2004లో వీళ్ళిద్దరూ విడిపోయారు.అనంతరం గౌతమితో కమల్ హాసన్ సహజీవనం కొనసాగించాడు.
*రేవతి
ప్రముఖ నటి రేవతి, నటుడు సురేష్ చంద్ర మీనన్ 1986లో పెళ్లి చేసుకున్నారు.వీరికి ఓ అమ్మాయి పుట్టింది.2013లో వీరిద్దరు విడిపోయారు.
*రమాప్రభ
1981లో రమాప్రభ, శరత్ బాబు పెళ్లి చేసుకున్నారు.1988లో వీరిద్దరు విడిపోయారు.తనను అవసరాలకు వాడుకున్నాడని రమాప్రభ పలుమార్లు శరత్ బాబుపై ఆరోపణలు చేసింది.