ఎమోషనల్ అయిన నటి మందిరా బేడీ.. భర్త లేని శూన్యత పూరించలేమంటూ?

ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ జూన్ నెల 30వ తేదీన హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే.నిన్న ఆయన పుట్టినరోజు కాగా భర్తను తలచుకుని మందిరా బేడీ ఎమోషనల్ అయ్యారు.

 Actress Mandira Bedi Remembers Late Husband Raj Kaushal His Birth Anniversary, B-TeluguStop.com

భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఆగష్టు నెల 15వ తేదీ ఎల్లపుడూ వేడుకలా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆగష్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం అని తన భర్త పుట్టినరోజు అని ఆమె చెప్పుకొచ్చారు.భర్తను తాము చాలా మిస్ అవుతున్నామని భర్త లేని శూన్యతను ఎన్నటికీ పూరించలేమని మందిరా బేడీ వెల్లడించారు.

రాజ్ కౌశల్ మరిచిపోవడానికి జ్ఞాపకం కాదని జీవితమని మందిరా బేడీ అన్నారు.తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని ఆమె చెప్పుకొచ్చారు.

తాను తిరిగి పని మొదలుపెట్టానని అందరికీ కృతజ్ఞతలు అని ఆమె తెలిపారు.

Telugu Anniversary, Heart Attact, Mandira Bedi, Mandirabedi-Movie

రాజ్ కౌశల్, మందిరా బేడీ ప్రేమించి వివాహం చేసుకున్నారు.1999 సంవత్సరంలో రాజ్, మందిర వివాహం జరిగింది.2011 సంవత్సరంలో వీళ్లకు వీర్ అనే కొడుకు జన్మించాడు.ఆ తర్వాత వీళ్లు తార అనే బాలికను దత్తత తీసుకున్నారు.800కు పైగా యాడ్స్ కు రాజ్ కౌశల్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

Telugu Anniversary, Heart Attact, Mandira Bedi, Mandirabedi-Movie

మందిరా బేడీ నటి కావడంతో పాటు యాంకర్ కూడా కావడం గమనార్హం.మరోవైపు మందిరా బేడీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేసుకోవడంతో పాటు సోషల్ మీడియా ద్వారా కీలక విషయాలను వెల్లడిస్తున్నారు.మందిరా బేడీ మళ్లీ సినిమాలతో బిజీ కావాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube