ఆగస్టు 15 భారత జాతి మొత్తానికి అతి పెద్ద పండుగ, అందరూ కలిసి చేసుకునే మువ్వన్నెల జెండా పండుగ.స్వాత్రంత్రం వచ్చిన ఈ రోజును దేశ వ్యాప్తంగా ఎంతో కోలాహలంగా నిర్వహించుకుంటారు భారతీయులు అందరూ.
విదేశాలలో ఉండే ప్రవాసులు కూడా ఈ రోజును ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.అయితే ఈ సారి జరిగిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కాస్త భిన్నంగా జరుపుకున్నారు ప్రవాసులు, ప్రవాస సంఘాలు.
వివరాలోకి వెళ్తే…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి జరగబోయే స్వాతంత్ర వేడుకలను అందరూ ఎంతో సంతోషంగా చేసుకోవాలి అలాగే భిన్నంగా జరపుకోవాలి అందుకు గాను మీరు రాష్ట్ర గాన్ ను ఆలపించి రికార్డ్ చేసి ప్రభుత్వానికి సంభందించిన రాష్ట్రగాన్.ఇన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.
ప్రధాని చేసిన ఈ వినూత్న ఆలోచనకు భారీ స్పందన వచ్చింది.విదేశాలలో ఉండే భారత ఎంబసీ లు ముందు నుంచీ ప్రవాసులను ఈ విషయంపై అలెర్ట్ చేయడంతో ఎంతో మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ఎంతో ఉశ్చాహంగా పాల్గొన్నారు.
పెద్దలంటే కూడా వేలాది మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తమ మృదువైన గాత్రాలతో జనగణమన పాడి రికార్డ్ చేసుకుని ప్రభుత్వ పోర్టల్ లో అప్లోడ్ చేశారు.అయితే ఏపీలోని తూగో జిల్లాకు చెందిన ఓ కుటుంభం గల్ఫ్ లో ఎన్నో ఏళ్ళ క్రితమే సెటిల్ అయ్యింది.ఈ కుటుంభానికి చెందిన 9 ఏళ్ళ కుమార్తె మారియా రాచెల్ తన గాత్రంతో పాడిన జనగణమణ ప్రవాసుల్లో హైలెట్ గా నిలుస్తోంది.
ఇప్పుడు ఆమె రికార్డ్ వైరల్ అయ్యింది.దుబాయ్ లోనే పుట్టి పెరిగిన రాచెల్ ఇంత చక్కగా పాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని పలువురు ప్రవాసులు రాచెల్ ను అభినందిస్తున్నారు.