ఇంకా ఎందుకమ్మా నన్ను జైల్లో ఉంచావ్.. డాక్టర్ బాబు ఆవేదన?

కార్తీకదీపం సీరియల్ ను గత కొన్ని నెలలుగా సాగదీస్తున్నారని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కార్తీకదీపం సీరియల్ క్లైమాక్స్ కు వచ్చిందని ప్రేక్షకులు భావించే సమయంలో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి సీరియల్ కు రేటింగ్స్ పెరిగేలా ఈ సీరియల్ దర్శకనిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు.

 Karthika Deepam Serial Fame Nirupam Paritala Funny Post On Instagram, Nirupam Pa-TeluguStop.com

2,000 ఎపిసోడ్ల వరకు ఈ సీరియల్ ప్రసారమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం మోనిత హత్య కేసులో డాక్టర్ బాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ లో నటుడే అయినా రియల్ లైఫ్ లో మంచి రచయిత కూడా అనే సంగతి తెలిసిందే.తను జైలులో ఉన్న ఫోటోను డాక్టర్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ ఫోటోలో డాక్టర్ బాబు, సౌందర్య పాత్ర పోషిస్తున్న అర్చనా అనంత్ నవ్వుతూ ఫోటో దిగారు.ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది.

డాక్టర్ బాబు తన పోస్ట్ లో అడగకుండానే డాక్టర్ ను చేశావని పిలవకుండానే స్టేషన్ కు వచ్చావని మరి ఇంకా ఎందుకమ్మా నన్ను లోపలే ఉంచావ్ అంటూ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో డైలాగ్ లా ఎమోషనల్ డైలాగ్ ను చెప్పారు.నెటిజన్లు డాక్టర్ బాబు పోస్ట్ పై తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.క్యాప్షన్ సూపర్ అన్నా అని కొంతమంది నెటిజన్లు చెబుతుంటే మరిందరు డాక్టర్ బాబు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని సూచిస్తున్నారు.

మరోవైపు కార్తీకదీపం ఫ్యాన్స్ మాత్రం దీపకు ఏ కష్టాలు లేకుండా కార్తీకదీపం సీరియల్ ను చూడాలని ఉందని కామెంట్లు చేస్తున్నారు.కార్తీకదీపం మోనితకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కిందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.ఆ రీజన్ వల్లే కొన్ని నెలలు మోనిత బిగ్ బాస్ కు దూరం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube