'అతడు' వచ్చి ఇన్నాళ్లయినా జోష్ తగ్గలేదు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కెరీర్ లో ఇప్పటి వరకు పాతిక సినిమాలకు పైగా చేశాడు.ఆయన కెరీర్‌ మొత్తంలో ది బెస్ట్‌ టాప్ 5 సినిమాలను తీయమంటే అభిమానులు చెప్పే పేర్లలో అతడు ఖచ్చితంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

 Mahesh Babu Trivikram Athadu Movie Completed 16 Years , Urstrulumahesh, 16yearsf-TeluguStop.com

అతడు సినిమా థియేటర్లలో వసూళ్ల విషయంలో నిరాశ పర్చింది.కాని బుల్లి తెరపై ఇప్పటికి కూడా సందడి చేస్తూనే ఉంది.

బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా అతడు బుల్లి తెరపై నిలిచింది.అంతటి ఘన విజయం సాధించిన అతడు సినిమాను ఇప్పుడు అభిమానులు మళ్లీ తల్చుకుంటున్నారు.

ఎందుకంటే అతడు వచ్చి అప్పుడే 16 ఏళ్లు అయ్యింది.నేడు అతడు కు 16 ఏళ్లు హ్యాష్ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్‌ అవుతోంది.

లక్షల మంది అభిమానులు తమకు అతడుతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ఉన్నారు.

Telugu @urstrulymahesh, Athadu, Mahesh Babu, Trivikram-Movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన అతడు సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా అప్పట్లో నిలుస్తుందని అంతా ఆశించారు.కాని సినిమా వసూళ్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయింది.భారీ ఎత్తున అంచనాలున్న అతడు సినిమాను అప్పట్లో మురళి మోహన్‌ నిర్మించాడు.

సినిమాను నిర్మించే సమయంలోనే ఆయన ఖచ్చితంగా బిగ్గెస్ట్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అనుకున్నారట.కాని కమర్షియల్‌ గా మెప్పించలేదు.

కాని మురళి మోహన్‌ కు ఈ సినిమా నష్టాన్ని ఏమీ మిగల్చలేదు.అప్పట్లో పది కోట్ల బడ్జెట్‌ తో రూపొందించారు.

అటు ఇటుగా బాగానే సినిమా రాబట్టింది.సోనూసూద్‌ కీలక పాత్రలో నటించాడు.ప్రకాష్ రాజ్ ఇంకా నాజర్‌, బ్రహ్మానందం, హేమ వంటి హేమా హేమీలు చాలా మంది సినిమాలో నటించారు.16 ఏళ్లు అయిన అతడు మరో పదేళ్ల వరకు కూడా తెలుగు వారిని అలరిస్తుంది అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube