నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్ జగదీష్ గత ఏడాది నుండి విడుదల కోసం ఎదురు చూస్తుంది.ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన సమయంలో అనూహ్యంగా సినిమా విడుదలకు కరోనా సెకండ్ వేవ్ అడ్డు వచ్చింది.
దాంతో విడుదలకు బ్రేక్ వచ్చింది.సెకండ్ వేవ్ తగ్గిన నేపథ్యంలో విడుదల కోసం కొత్త తేదీని ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సమయంలోనే నాని శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ ను కూడా నేటితో ముగించేశాడు.రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందిన శ్యామ్ సింగరాయ్ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చేపట్టారు.
ట్యాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ఇప్పుడు నాని తో తెరకెక్కించిన శ్యామ్ సింగరాయ్ గురించి అంతా కూడా చర్చించుకుంటున్నారు.
సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని ఇటీవలే యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
అన్నట్లుగానే సినిమా ను నేటితో ముగించినట్లుగా నాని ప్రకటించాడు.నాని లుక్ ఈ సినిమా లో చాలా విభిన్నంగా ఉంటుందనే విషయం తెల్సిందే.
షూటింగ్ పూర్తి అవ్వడంతో సినిమా విడుదలకు ఏర్పాట్లు చేయబోతున్నరు.నాని లుక్ విభిన్నంగా ఉండటంతో పాటు అన్ని విధాలుగా ఈ సినిమా కు బజ్ ఉంది.
ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.ఇక నాని ఇప్పటికే కమిట్ అయిన అంటే సుందరానికి సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది.నాని అంటే సుందరానికి సినిమాలో కూడా విభిన్నమైన గెటప్ తో అలరించబోతున్నాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యే సినిమాలను నాని బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాడు.
మరి విడుదల ఎప్పుడో చూడాలి.