తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి ఎంత చెప్పిన తక్కువే అని చెప్పాలి.తిరుమల లడ్డు ప్రపంచం మొత్తం ప్రసిద్ధి చెందింది.
శ్రీవారి లడ్డుకు ఉన్న రుచి మరే స్వీట్ కి ఉండదు అనడంలో అతిశయోక్తి కాదు.శ్రీవారి ప్రసాదంను ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు.
తిరుపతి నుంచి తెచ్చిన లడ్డు ప్రసాదాన్ని వారు తినడమేకాకుండా చుట్టూ పక్కల ఉన్న అందరికి పంచడం మనం చూసే ఉంటాము.మనతో పాటు మన చుట్టూ పక్కల ఉన్నవారు కూడా శ్రీవారి లడ్డును తినాలని ఒక మంచి భావంతో అందరికి పంచుతాము.
అయితే ఈ క్రమంలోనే శ్రీవారి లడ్డును ఇకమీదట ఒక కవర్ ప్యాకింగ్ లో భక్తులకు అందించనుంది టీటీడీ. ఏంటి కవర్ అంటే ప్లాస్టిక్ తో చేసినది కదా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడదాం అని ప్రభుత్వాలు చెబుతుంటే, కవర్ లో పెట్టి ప్రసాదం అందించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.
మీ కొచ్చిన డౌట్ నిజమే కానీ శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే లడ్డు కవర్ పూర్తిగా పర్యావరణహితమైనది.అంటే అ కవర్ ప్లాస్టిక్ మాదిరి కాకుండా భూమిలో చాలా త్వరగా కలిసిపోతుంది.
కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచులు తయారు చేయబడినవట.అందుకే వాటిని ఉపయోగించడానికి టీటీడీ అంగీకరించినట్లు తెలుస్తుంది.
ఇక మీదట ప్లాస్టిక్ కవర్ల బదులు కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో తయారు చేసిన ఈ సంచీలను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ రామ్ మనోహర్ బాబు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి ఇండ్రస్టియల్ ఏరియాలోని ఎకొలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో తయారు చేసిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలసి విడుదల చేశారు.ఈ సందర్భంగా రామ్ మనోహర్ బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్
.