యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ షణ్ముఖ్ జశ్వంత్ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో షణ్ముఖ్ కూడా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కొన్ని వారాల క్రితం మద్యం సేవించి షణ్ముఖ్ యాక్సిడెంట్ చేశారని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ కొత్త కారును కొనుగోలు చేశారు.
ఇది తన కొత్త కారని ఇకపై తాను పార్టీలు చేసుకోనని త్వరలో డ్రైవర్ ను కూడా పెట్టుకుంటానని షణ్ముక్ పోస్ట్ పెట్టగా నెటిజన్లు మాత్రం ట్రోల్స్ ఆపడం లేదు.షణ్ముఖ్ కారు నంబర్ కనిపించకుండా జాగ్రత్త పడటంతో చలానాలను నెటిజన్లు చెక్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అలా జాగ్రత్త పడ్డారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు కొత్త కారును డ్రైవ్ చేసే సమయంలో అయినా జాగ్రత్తగా ఉండాలని షణ్ముఖ్ కు సూచిస్తున్నారు.
మరి కొందరు ఏకంగా మద్యం తాగి వాహనం నడపవద్దని షణ్ముఖ్ కు కామెంట్లు పెడుతుండటం గమనార్హం.షణ్ముఖ్ యాక్సిడెంట్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే యూట్యూబ్ లో మాత్రం షణ్ముఖ్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
షణ్ముఖ్ వీడియోలు విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.
షణ్ముఖ్ జశ్వంత్ డ్రైవర్ ను పెట్టుకుంటానని చెప్పినా నెటిజన్లు మాత్రం అతనిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుండటం గమనార్హం.ఈ ట్రోల్స్ గురించి షణ్ముఖ్ జశ్వంత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.వైవా అనే వెబ్ సిరీస్ తో గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.