సమంత హీరోయిన్ గుణశేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న శాకుంతలం సినిమాలో కీలక పాత్రకు గాను అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను తీసుకున్నట్లుగ అధికారికంగా ప్రకటన వచ్చింది.గుణ శేఖర్ అర్హను వెండి తెరకు పరిచయం చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
ప్రిన్స్ భరతుడి గా అర్హ ను చూపించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.అర్హను అధికారికంగా ప్రకటించడానికి ముందు శాకుంతలం సినిమాలో మహేష్ బాబు కూతురు సితార లేదా అల్లు అర్జున్ కూతురు అర్హ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
మహేష్ బాబు కూతురు సితార కాస్త పెద్ద పాప అవ్వడంతో పాటు ఇప్పటికే సోషల్ మీడియా లో మంచి పేరు ఉంది.పైగా ఆమెకు యాక్టివ్ పాప అంటూ అభిమానులు కితాబు ఇచ్చారు.
ఇప్పటికే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రేక్షకులకు చేరు అయిన సితార అయితే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాని అర్హ ను గుణశేఖర్ ఎంపిక చేయడం పట్ల కొందరు మహేష్ బాబు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సితార మరియు అర్హలను పరిశీలించి ఆ తర్వాత అర్హ ను తీసుకోవడం ఏంటీ అంటూ అభిమాను లు ప్రశ్నిస్తున్నారు.అలాంటప్పుడు సితార గురించి మీడియా లో ఎందుకు వార్తలు వచ్చాయి.
సితార పాపను ఈ విషయం లో అవమానించినట్లే అంటూ అసంతృప్తిని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం కథానుసారంగా భరతుడు పాత్రకు అది కూడా చిన్నప్పటి క్యూట్ లుక్ లో ఉండాలి అంటే అర్హ అయితేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చామని.సితార పెద్ద అమ్మాయిగా ఉంటుందనే ఉద్దేశ్యం తో అర్హ ను తీసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు.మరి ఈ విషయం లో గుణశేఖర్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు కరెక్ట్ అనేది సినిమా చూస్తే కాని తెలియదు.