భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రపంచానికి తీవ్ర వ్యాక్సిన్ కొరత ఎదురైంది.దిగ్గజ ఫార్మా కంపెనీలు, ఎన్ని కోట్ల డోసులైనా సరే ఉత్పత్తి చేయగల సామర్ధ్యం, పరిశోధనలతో భారత్.
ఫార్మా రంగంలో అగ్రగామిగా వుండటంతో పాటు ప్రపంచ టీకా రాజధానిగా వెలుగొందుతోంది.ఇలాంటి పరిస్ధితుల్లో కోవిడ్ రెండో దశ కారణంగా భారత్ వ్యాక్సిన్ సరఫరాను తగ్గించిందని బైడెన్ పరిపాలనా యంత్రాంగం అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపింది.
అందువల్లే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని వెల్లడించింది.
డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న తరుణంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
కోవాక్స్‌కు పంపాల్సిన వందల మిలియన్ల వ్యాక్సిన్లను వెనక్కి తీసుకున్నట్లు యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ సమంతా పవర్.అమెరికా కాంగ్రెస్ కమిటీకి తెలిపారు.
ఏజెన్సీ వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్ కమిటీ ముందు స్టేట్‌మెంట్ ఇచ్చిన సమంత.ఆగస్టులో ఆన్‌లైన్‌లోకి రానున్న ఫైజర్ వ్యాక్సిన్‌ను అమెరికా కొనుగోలు చేసిందని అందువల్ల త్వరలోనే కొరత తీరుతుందని చెప్పారు.
ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు రెండవ డోసు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వున్నందున భారత్ .కోవాక్స్‌కు పంపాల్సిన టీకాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని సమంత వెల్లడించారు.
కాగా, భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఇండియా వణికిపోయింది.ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పాలకుల దూరదృష్టి లోపించడంతో భారత్‌లో రెండో దశ ఉత్పన్నమైందని మేధావులు ఆరోపించారు.ఫిబ్రవరి చివరి నుంచి జూన్ మొదటి వారం వరకు దేశాన్ని వైరస్ సునామీలా ముంచెత్తింది.
కోవిడ్ సోకిన వారు చికిత్స తీసుకునేందుకు బెడ్లు ఖాళీగా లేవు, దీనికి తోడు ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు, టెస్టింగ్ కిట్లు ఇలా అన్నింటి కొరత వేధించింది.ప్రభుత్వం నిద్ర లేచే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సరిగా నిర్వర్తించకపోవడం కూడా సెకండ్ వేవ్‌కు కారణమని పలు నివేదికలు తేల్చాయి.
మనదేశ అవసరాలు పక్కనబెట్టి మరి.ప్రధాని మోడీ టీకా దౌత్యం పేరిట అనేక దేశాలకు వ్యాక్సిన్ డోసులను ఉచితంగా పంపారు.దీంతో భారత్‌లో అసరమైన సమయంలో టీకాల కొరత వేధించింది.
మనదేశంలో ఉత్పత్తి వేగవంతం చేద్దామంటే ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై అమెరికా సహా పలు దేశాలు నిషేధం విధించాయి.దీంతో భారత్ టీకాల కోసం అంతర్జాతీయ సమాజం వైపు చూసింది.