క‌త్తి ఖ‌త‌ర్నాక్ అంటున్న శివాజీ రాజా తనయుడు

శివాజీ రాజా అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ వేయి శుభములు కలుగు నీకు.ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలోని తొలి పాటకు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Shivaji Raja Son Vijay Raja Movie Veyi Subhamulu Kalugu Neeku Second Song , Act-TeluguStop.com

తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్‌ను ప్ర‌ముఖ న‌టుడు శివాజీ రాజా విడుద‌ల చేశారు.ఈ పాట కూడా తప్పకుండా ప్రేక్షకుల ఆధరాభిమానాలను దక్కించుకుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండవ పాట ఐటెం సాంగ్ కత్తి ఖతర్నాక్‌ విడుదల సంద‌ర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ.చాలా పాజిటివ్ టైటిల్.సినిమా అంతా కూడా అదే పాజిటివ్ తో జ‌రిగింది.దీనికి కార‌ణం నిర్మాత‌లు.

ఎంతో మంది నిర్మాత‌ల‌ను చూశాను నా కెరీర్ లో కానీ వీరు మ‌న‌సు పెట్ట్టి సినిమా తీశారు.అంద‌రూ అలాగే ప‌ని చేశారు.

అనుకున్న బ‌డ్జెట్ లో రాజీ ప‌డ‌కుండా అనుకున్న విధంగా తీశారు.అంద‌రూ క‌లిసి మెలిసి ప‌ని చేశారు.

ఈ ఐట‌మ్ సాంగ్ లో ఫాల్గుణి, విజ‌య్ రాజా అద్భుతంగా న‌ర్తించారు.ఈ సినిమాలో నేను కూడా మంచి పాత్ర చేశాను అన్నారు.

Telugu Shivaji Raja, Telugu, Tollywood, Veyisubhamulu, Vijay Raja-Movie

హీరో విజ‌య్ రాజా మాట్లాడుతూ ఐట‌మ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంగా ఉన్నాం.డాన్సర్ ఫాల్గుణి తో పాట చేయ‌డం హ్యాపీ.మా ఇద్దరి కాంబో తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.గ్యానీ సూప‌ర్బ్ మ్యూజిక్ ఇచ్చారు అన్నారు.

Telugu Shivaji Raja, Telugu, Tollywood, Veyisubhamulu, Vijay Raja-Movie

నిర్మాత మాట్లాడుతూ మా చిత్రానికి అద్భుతమైన టెక్నిషన్స్ పని చేసారు.ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుడు గ్యాని గారు ఇచ్చిన పాట‌లు సినిమాకు హైలెట్ .హీరో విజ‌య్ రాజా ఎంతో డెడికేటెడ్‌గా సినిమా చేస్తూ మాకు ఎంతో స‌పోర్ట్ చేశారు.అలాగే శివాజీ రాజా గారు కూడా ఎంతో స‌పోర్ట్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు సినిమాను అనుకున్న దానిక‌న్నా బాగా తీశారు.ప్రేక్ష‌కులు మా చిత్రాన్నిఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube