కమెడియన్ వేణుమాధవ్ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి 400కు పైగా సినిమాలలో నటించి కమెడియన్ గా వేణుమాధవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.2019 సంవత్సరంలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ వేణుమాధవ్ మృతి చెందిన సంగతి తెలిసిందే.సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్ కు బాల్యం నుంచే డ్యాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం.

 Tollywood Star Comedian Venu Madhav Property Details Here, Laxmi Movie, Property-TeluguStop.com

రవీంద్ర భారతిలో చేసిన ఒక కామెడీ స్కిట్ వల్ల వేణు మాధవ్ జీవితమే మారిపోయింది.

తొలి సినిమా సంప్రదాయం కోసం వేణుమాధవ్ ఏకంగా 70వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు.ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లతొ బిజీ అయిన వేణు మాధవ్ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు.20 సంవత్సరాల పాటు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న వేణుమాధవ్ ఎమ్మెల్యే కావాలని భావించినా ఆ కోరిక తీరకుండానే చనిపోయారు.

Telugu Venumadhav, Laxmi, Nandi Award, Teluudesham, Houses-Movie

వేణుమాధవ్ చనిపోయి రెండు సంవత్సరాలు అయినా ఆయన అభిమానులు నేటికీ వేణుమాధవ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.తన కామెడీ టైమింగ్ తో వేణుమాధవ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే వేణుమాధవ్ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో బాగా కూడబెట్టారని సమాచారం.

వేణుమాధవ్ కు హైదరాబాద్ లోని వేర్వేరు ఏరియాల్లో పది ఇళ్లు ఉన్నాయి.

Telugu Venumadhav, Laxmi, Nandi Award, Teluudesham, Houses-Movie

వేణుమాధవ్ స్థిరాస్తులు బాగానే సంపాదించారని తెలుస్తోంది.వేణు మాధవ్ సంపాదించిన ఆస్తుల మార్కెట్ విలువ భారీగా ఉండవచ్చని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.కరీంనగర్, కోదాడలో వేణుమాధవ్ కు వ్యవసాయ భూములు ఉన్నాయని తెలుస్తోంది.

వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో సైతం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని సమాచారం.

Telugu Venumadhav, Laxmi, Nandi Award, Teluudesham, Houses-Movie

వేణుమాధవ్ సినిమాల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేశారని సమాచారం.లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ కామెడీకి నంది పురస్కారం వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube