నూనూగు మీసాల వయసులో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.నిన్ను చూడాలని మూవీతో వెండి తెర మీద దర్శనం ఇచ్చాడు.
ఈ సినిమాలో తనకు జోడీగా నటించిన హీరోయిన్ రవీనా రాజ్ పుత్.అయితే ఈ సినిమా కంటే ముందే బాల రామాయణం అనే సినిమాలో నటించాడు.
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అంతా 10 నుంచి 12 ఏండ్ల వయసున్న బాల బాలికలే నటించారు.ఈ సినిమా అప్పట్లో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర పోషించగా.సీత క్యారెక్టర్ స్మితా మాధవ్ పోషించింది.
చిన్న వయసులో తను నటన అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.తన ముఖకవలికలు ఎంతగానో ఆశ్చర్యపరిచాడు.
అప్పటి ఈ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో అనే ఇంట్రెస్ట్ జనాల్లో కలుగుతుంది.ఇంతకీ ఆమె ఎక్కడుందో? ఏం చేస్తుందో? ఇప్పుడు తెలుసుకుందాం.
స్మితా మాధవ్ ప్రస్తుతం ఓ ఫేమస్ డ్యాన్సర్.క్లాసికల్ డ్యాన్సులో మంచి ట్రైనింగ్ తీసుకుంది.అద్భుత డ్యాన్సర్ గా పేరు సంపాదించింది.చాలా స్టేజ్ షోలు చేసింది.
దేశ, విదేశాల్లో పలు షోలు చేసింది.సంప్రదాయ నాట్యంలో అద్భుత ప్రతిభ కనబర్చిన స్మితా.
అమెరికా, ఆస్ర్టేలియా, వియత్నాం, సింగపూర్, మలేషియా సహా పలు దేశాల్లో ప్రశర్తనలు ఇచ్చింది.ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది.
నాట్యంలో అద్భుత ప్రతిభ ఉన్న స్మితా మాధవ్ సినిమాల్లోకి మాత్రం రాలేదు.ఈమెకు సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదట.పలు సినిమాల్లో నటించాలని అవకాశం వచ్చినా.తను నో చెప్పిందట.సంగీతం, నాట్యం పట్ల ఉన్న మక్కువతో ఆయా రంగాల వైపే అడుగులు వేసింది.ఈ రెండు రంగాల్లో మంచి శిక్షణ తీసుకుంది.
అంతేకాదు పలువురు యువతీ యువకులకు శిక్షణ కూడా ఇస్తోందట.అటు కొన్ని పాటలకు క్రొరియోగ్రఫీ కూడా చేసింది స్మిత.
పలు మ్యూజిక్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది.ప్రస్తుతం సంగీతం, నాట్యం తన ప్రపంచంగా ముందుకు సాగుతోంది నాటి ఈ చిన్నారి సీత.