సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో 100కు పైగా సినిమాల్లో హీరోగా నటించిన బాలకృష్ణ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఒకవైపు హీరోగా బిజీగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.బాలయ్య పుట్టినరోజు సందర్భంగా నిన్న అఖండ మూవీ నుంచి పోస్టర్ రిలీజైంది.
నేడు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బాలకృష్ణ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వెలువడనుంది.నేడు బాలయ్య తన 61వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.సీనియర్ ఎన్టీఆర్, బసవతారకంల ఎనిమిదో సంతానం బాలకృష్ణ.తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఈ సినిమాలో నటించే సమయానికి బాలయ్య వయస్సు కేవలం 14 సంవత్సరాలు కావడం గమనార్హం.
ఈ జోనర్ ఆ జోనర్ అనే తేడాల్లేకుండా అన్ని జోనర్ల సినిమాలలో బాలకృష్ణ నటించగా బాలయ్య హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశాయి.
జయాపజయాలకు అతీతంగా 46 సంవత్సరాల నుంచి బాలకృష్ణ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.తండ్రి కోరిక ప్రకారం బీఏ డిగ్రీ చదివిన బాలకృష్ణ కెరీర్ తొలినాళ్లలో తండ్రి హీరోగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా నటించారు.
సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్ లో మొత్తం 12 సినిమాలు తెరకెక్కాయి.12 సినిమాల్లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించగా టైటిల్ లో సింహా అనే పేరు ఉన్న బాలయ్య సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్ అయ్యాయి.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, బి గోపాల్ బాలయ్య సినిమాలలో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించారు.బాలయ్య సినిమాలలో ఏకంగా 17 సినిమాలలో బాలయ్యకు జోడీగా విజయశాంతి నటించారు.