నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు..!

ఏపీ సిఎం గా వై.ఎస్ జగన్ నేటితో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.

 Atchennaidu About Ys Jagan Two Years Ruling, Achennaidu, Andhra Pradesh, Ap Cm,-TeluguStop.com

ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్.సి.పీ ప్రభుత్వం ఓ స్పెషల్ బుక్ రిలీజ్ చేసింది.జగన్ రెండేళ్ల పాలనపై తనదైన శైలిలో స్పందించారు అచ్చెన్నాయుడు.

ఈ రెండేళ్లలో సిఎం చేసిన విధ్వంసంపై జగన్ విధ్వంసం అనే చార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.జగన్ విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని అన్నారు.

జగన్ రెండేళ్ల పాలన విధ్వంసంపై తాను చర్చకు సిద్ధమని అన్నారు.

రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులందరు డమ్మీలే అని ఆయన అన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చాక జేసీబీ, ఏసీబీ, పీసీబీ ట్యాగ్ లైన్ సీఐడీ అని ఎద్దేవా చేశారు.జేసీబీతో కూల్చడం.ప్రశ్నిస్తే వారిపై ఏసీబీ కేసులు పెట్టడం.కుదరకపోతే పీసీబీని రంగం లోకి దించడం అలవాటుగా మారిందని అన్నారు.

సిఎం ఏది చెబితే సీఇడీ అదే చేస్తుందని అన్నారు.వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం నవరత్నాలుగా చెప్పుకుంటున్న ఈ పథకాలు నకిలీ రత్నాలని అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్రంలో అన్ని సమస్యలే ఉన్నాయని నిరుద్యోగులు పెరుగుతున్నారని అన్నారు.జూన్ 1 నాటికి పోలవరం పూర్తవుతుందని అన్నారని.దాని గురించి జగన్ మాట్లాడరేంటని అచ్చెన్నాయుడు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube