మనుషులకు కుక్కలంటే చాలా ఇష్టం ఉంటుంది.అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటుంటారు.
ఆ కుక్కలను తమ ఇంట్లో ఓ సభ్యుడిగా ట్రీట్ చేస్తారు.అందుకే కుక్కలు తమ యజమానులకు విశ్వాసంగా ఉంటాయి.
తమ ప్రాణాల్ని అడ్డు వేసైనా సరే తమ యజమానులను రక్షించుకుంటాయి.అందుకే కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదంటారు.
మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్క.సుమారు 14,000 ఏళ్ల కిందటి నుంచే కుక్కలు మనుషులతో కలిసి జీవించడం నేర్చుకున్నాయని చెబుతారు.
కుక్క మనిషికి ఒక ఫ్రెండ్ లాంటిది.కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి.
మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఏర్పరుచుకుంటారు.
ఇక తాజాగా కుక్కకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాటిల్ ఛాలెంజ్, పిల్లో ఛాలెంజ్ అంటూ రకారకాల ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మరో ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.ఆ ఛాలెంజ్ ఏంటంటే.
కొంతమంది దంపతులు తమ పిల్లలు తమ ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారని.చెక్ చేస్తున్నారు.
వారి మధ్యలో వారి పిల్లలను నిల్చోబెట్టి సడెన్ గా చెరో వైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు.
అప్పుడు ఆ పిల్లలు ఎవరి వైపు పరిగెడుతారో తెలుసుకోవాలని ప్రయాత్నాలు చేస్తున్నారు.ఈ ఛాలెంజ్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా ఓ జంట తమ పెంపుడు కుక్కపిల్లతో ఈ ఛాలెంజ్ ను చేశారు.
ఇందుకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రోడ్డుపై ఆ దంపతులిద్దరూ నిల్చున్నారు.వారి మధ్యలో వారి పెంపుడు కుక్కపిల్లను నిల్చోబెట్టారు.వెంటనే వారు చెరో వైపు పరుగులు పెట్టారు.ఆ కుక్కపిల్ల ఎటు వెళ్లాలో డిసైడ్ చేసుకోలేక అక్కడే గిర్రా గిర్రా రౌండ్స్ తిరుగుతూ ఉంది.ఈ ఫన్నీ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.