మరో సారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య...ఏం చేసాడంటే?

ప్రస్తుతం కంటికి కనిపించకుండా మానవాళిని కబళిస్తున్న కరోనా మహమ్మారితో లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు.కరోనా మొదటి వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ వేగవంతంగా రూపాంతరం చెంది మొదటి వేవ్ లో కొద్దిగా కేసులు భారీగానే నమోదైనా, మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి ఉంది.

 Once Again, Balayya Expressed A Great Mind What Did He Do Actor Balakrishna, Cor-TeluguStop.com

కాని కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం కేసులు భారీగా నమోదవుతూనే, మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.అయితే దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు సామాన్య ప్రజల మొదలు, సెలెబ్రెటీలు నడుం బిగించిన పరిస్థితి ఉంది.

ఇప్పటికే చిరంజీవి ప్రతి ఒక్క జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు.అయితే తాజాగా బాలయ్య కూడా కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు.

అయితే ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.అయితే కరోనా విజ్రుంభిస్తున్న దృష్ట్యా బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు కరోనా హోమియో పిల్స్ ను బాలయ్య అందజేస్తున్నారు.ఇప్పటికే తన నియోజకవర్గం హిందూపూర్ లో తన సొంత ఇంటినే ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాడు.20 లక్షల రూపాయల విలువ చేసే కరోనా కిట్లను అందజేసి బాలయ్య తన అభిమానుల మనసు దోచుకున్నాడని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube