ఆర్ నారాయణ మూర్తి. ప్రజల కష్టాలే ఆయన సినిమా కథలు.
కార్పొరేట్ కంపెనీల మోసాలే.తన సినిమా కథా వస్తువులు.
జనాల సినిమాలు తీసి పీపుల్స్ స్టార్ గా ఎదిగిన వ్యక్తి నారాయణమూర్తి.అప్పట్లో ఈయన తీసిన సినిమాలు అద్భుత విజయాలు అందుకున్నాయి.
పేదవాళ్ల హీరోగా నారాయణమూర్తి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న కాలం అది.పైగా విప్లవ సినిమాలు ఆడుతున్న తరుణమది.అందుకే ఎంతోమంది నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీ పడ్డారు.స్వతహాగా వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి.తనకు వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలని ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు.పైగా తానూ మొదటి సినిమా చేయడానికి తనకు సాయం చేసిన కొంతమంది మిత్రుల రుణం తీర్చుకోవాలని ర్ణయించుకున్నారు.
తన మిత్రులకు ఎలాగైనా మంచి సినిమాలు చేసి, వారికి ఆర్థికంగా లాభం చేకూర్చాలనేది ఆయన ఆశ.
అదే సమయంలో నిర్మాత పోకూరి బాబూరావుకు ఓ సినిమా చేయాలని నారాయణమూర్తి అనుకున్నారు.నారాయణమూర్తి హీరోగా మారుతున్న సమయంలో పోకూరి బాబూరావు మాట సాయం చేశారట.అది దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్ రెడీ చేయించి ఆయనకు డేట్స్ ఇచ్చాడు.ఇక పోకూరి బాబూరావుకి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అంటే నమ్మకం ఎక్కువ.అందుకే ఆయన దగ్గరకు వెళ్లి నువ్వే డైరెక్ట్ చేయాలని కోరాడు.
అలా తెరకు ఎక్కిందే ఎర్రోడు మూవీ.
తను ఎంతో ఇష్టంగా సినిమా చేసినా.ఎర్రోడు చిత్రం అంతగా ఆడలేదు.నారాయణమూర్తి మార్కెట్ తగ్గడానికి కారణం అయ్యింది ఈ సినిమా.
ఆ రోజుల్లో ఆ సినిమా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.కానీ హిట్ అవ్వకపోవడానికి ముఖ్యకారణం నారాయణమూర్తి పై డ్యూయెట్లు పెట్టడమే.
ఆయనను అభిమానించే వాళ్లకు ఇవి అసలు నచ్చలేదు.కానీ ఆయనను కమర్షియల్ హీరోగా పెంచాలనే ఆలోచనతో, కాస్త మోడరన్‌గా చూపించాలనే ఆశతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కొత్త ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
అయితే ఈ సినిమా వల్ల లాభపడ్డారు నిర్మాత బాబూరావు.మంచి రేట్లకు సినిమాని అమ్మారు.
నారాయణమూర్తి పై నమ్మకంతో బయ్యర్లు కూడా ఎక్కువ పెట్టి సినిమాని కొన్నారు.దాంతో కొన్నవాళ్ళు అంతా భారీగా నష్టపోయారు.
ఆ నష్టాలు వల్లే నారాయణమూర్తి సొంత సినిమాలను తక్కువ రేట్లుకు అమ్మాల్సి వచ్చింది.నారాయణమూర్తి మంచి తనమే ఆయనకు శాపంలా మారిందని సినీ జనాలు చెప్పుకుంటారు.