పాన్ ఇండియా సినిమా అనగానే టక్కున గుర్తొచ్చేది బాహుబలి.భారతీయ చిత్ర పరిశ్రమను బాహుబలికి ముందు.
బాహుబలికి తర్వాతగా విభజించేంతగా ఈ సినిమా ప్రభావితం చేసింది.కనీవినీ ఎరుగని బడ్జెట్ బడ్జెట్ కు పదింతలకు పైగా వసూల్లు రాబట్టిన సినిమా ఇది.ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది.అయితే ఇప్పుడే కాదు.
గతంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కింది.ఈ విషయం వింటే అందరికీ ఆశ్చర్యం కలగకమానదు.
ఇంతకీ ఆ పాన్ ఇండియన్ మూవీ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
తెలుగు సినిమా అనగానే అలనాటి మేటి నటుడు ఎన్టీఆర్గుర్తుకు వస్తాడు.
రాముడైనా, రావణుడైనా, విష్ణువు అయినా, దుర్యోధనుడైనా ఏ పాత్రలో నటించినా.నిజంగా వారే దిగివచ్చి ఆయనలో పరకాయ ప్రవేశం చేశారేమో అనిపిస్తుంది.
రాముడి పాత్రను చూసే నిజానికి రాముడు ఇలాగే ఉంటాడు అని జనాలు భావించేలా నటించాడు రామారావు.ఆయన చేసిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో ఒకటి లవకుశ.
శ్రీ రాముడిగా ఎన్టీఆర్, సీతాదేవిగా అంజలీ దేవి ఆ పాత్రల్లో జీవించారు.గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లోనూ ఈ సినిమా క్లైమాక్స్ లో భూమి రెండుగా చీలి సీతాదేవి తల్లి గర్భం లోకి వెళ్లి పోయే సన్నివేశం చిత్రీకరించి సంచలనం కలిగించారు.
తెలుగు కలర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. 1963 మార్చి 29న ఈ సినిమా వైభవంగా విడుదల అయ్యింది.
తెలుగు సినిమా పరిశ్రమలో లవకుశ సినిమా రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టింది.75 వారాలు ప్రదర్శించిన తొలి తెలుగు చిత్రంగా ఘనత సాధించింది. 365 రోజులకు కోటి రూపాయలు సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా రికార్డులకెక్కింది.అప్పట్లో సినిమా టికెట్ ధర కేవలం 25 పైసలు మాత్రమే.ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్ బోర్టులే కనిపించేవి.జనం బళ్ళు కట్టుకుని వెళ్లి సినిమా చూశారు.
లవకుశ సినిమా తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది.అక్కడ కూడా సంచలన విజయం సాధించింది.
ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి జాతీయ అవార్డును అందుకుంది.