బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో సల్మాన్ ఖాన్ ఒకరనే సంగతి తెలిసిందే.పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాల ద్వారా వార్తల్లో నిలిచిన సల్మాన్ ఖాన్ పెళ్లి మాత్రం చేసుకోలేదు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వయస్సు 55 సంవత్సరాలు కాగా భవిష్యత్తులో సైతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన సల్మాన్ ఖాన్ కు లేదు.అయితే సల్మాన్ ఐశ్వర్యారాయ్ చాలా సంవత్సరాల క్రితం ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
ఐశ్వర్య సల్మాన్ ల పెళ్లి జరగాల్సి ఉన్నా సల్మాన్ ఖాన్ చేసిన చిన్నచిన్న తప్పుల వల్లే ఆ పెళ్లి ఆగిపోయిందని సల్మాన్ ఖాన్ సన్నిహితులు చెబుతుంటారు.సినిమా ఇండస్ట్రీలోకి ఐశ్వర్యారాయ్ నటిగా ఎంట్రీ ఇచ్చే సమయానికి సల్మాన్ ఖాన్ స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు.
హల్ దిల్ దే చుకే సనమ్ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ హీరో కాగా ఆ సినిమాలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించారు.ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యే నాటికి ఐశ్వర్య, సల్మాన్ ప్రేమలో ఉన్నారు.
సల్మాన్ తన కుటుంబ సభ్యులను ఐశ్వర్యకు పరిచయం చేయగా ఐశ్వర్య తరచూ సల్మాన్ ఇంటికి వస్తూ ఉండేవారు.అయితే ఐశ్వర్యారాయ్ తల్లిదండ్రులకు మాత్రం ఐశ్వర్య సల్మాన్ ను ప్రేమించడం నచ్చలేదు.
సల్మాన్ ను పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య భావించినా పెళ్లి తర్వాత ఆఫర్లు తగ్గుతాయని భావించి ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ఒక సందర్భంలో సల్మాన్ ఐశ్వర్యా రాయ్ ఉంటున్న అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లి కిందకు దూకేస్తానని బెదిరించారు.
ఆ తరువాత సల్మాన్ ఖాన్ వల్ల ఐశ్వర్యారాయ్ కు ఛల్తే ఛల్తే సినిమాలో ఛాన్స్ పోయింది.సల్మాన్ ప్రవర్తన వల్ల కెరీర్ ప్రమాదంలో పడేలా ఉండటంతో 2002 సంవత్సరం మార్చి నెలలో ఐశ్వర్య సల్మాన్ కు బ్రేకప్ చెప్పారు.ఆ తరువాత భవిష్యత్తులో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించనని ఐశ్వర్యారాయ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.సల్మాన్ ప్రవర్తనే ఐశ్వర్యతో బ్రేకప్ కు కారణమని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.