కరోనా కంటే ముందు హీరోయిన్స్ పారితోషకాలు కొన్ని కోట్లలో ఉండేవి.అప్పుడే హీరోయిన్స్ వరుస సినిమావకాశాలు అందుకుంటున్న రోజులవి.
వరుస పెట్టి హీరోయిన్స్ సినిమాలు చేస్తూ పారితోషకాలు అందుకుంటున్నారు.హఠాత్తుగా వారి సినిమాలకి కొన్ని నెలలు బ్రేక్ పడింది.
సుమారు తొమ్మిది నెలలు వారు ఏ సినిమా షూటింగ్స్ లో పాల్గొనలేదు.పారితోషకాలు అందుకోలేదు.
ఎప్పుడైతే లాక్ డౌన్ వల్ల మొత్తం దేశం స్తంభించిపోయిందో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు.సినిమా ఇండస్ట్రీ, రవాణా, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కార్యాలయాలు,కోర్టులు,సాఫ్ట్ వేర్ కంపెనీస్,అన్ని మూతపడ్డాయి.
సుమారు తొమ్మిది నెలల తర్వాత తిరిగి అన్ని ప్రారంభం అయ్యాయి.ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలతో అన్ని షూటింగ్స్ మళ్ళీ మొదలైయ్యాయి.
ఇన్ని నెలలు అన్ని పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది.అందులో సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని కోట్ల రూపాయల మేర నష్ట్టపోయింది.
కొన్ని సినిమాలు విడుదల అవక ఆగిపోయాయి.దీంతో నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ కోసం మళ్ళీ లాభాలు రావాలని షూటింగ్ లో పాల్గొంటున్న హీరో మరియు హీరోయిన్ పారితోషకాలను తగ్గించుకుంటున్నారు.
ఆలా పారితోషకాలను తగ్గించుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడుద్ మనం తెలుసుసుకుందాం.
ప్రస్తుతం తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే పారితోషకం విషయంలో వెనక్కి తగ్గారు.అలాగే ఫిదా తో తెలుగు ప్రేక్షకులందరని ఫిదా చేసిన సాయి పల్లవి కూడా పారితోషకం విషయంలో కాస్త తక్కువ తీసుకుంటున్నారట.అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తాను తీసుకునే పారితోషకంలో కొత్త విధించారు.
తమిళ్ లో చేసే హీరోయిన్స్ అందరిలో ఎక్కువ పారితోషకం తీసుకునే నయనతార ఇప్పుడు పారితోషకం లో అలోచించి తీసుకుంటున్నారట.అంతేకాకూండా తెలుగు లో స్టార్ హీరోలతో చేసిన వాళ్ళు ఇప్పుడు వారు తీసుకునే పారితోషకం సగానికి తగ్గించేసారట.
మూడు కోట్లకు పైగా తీసుకునే అనుష్క ఇప్పుడు కోటి నుండి లక్షల్లో తీసుకుంటున్నారు.ఈ అనుష్క బాటలో కాజల్,రకుల్ మరియు సమంత కూడా చేరిపోయారు.అంతకుముందు పారితోషకం విషయంలో ఖచ్చితంగా ఉండే వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేయడం లేదంటే కరోనా సినిమా ఇండస్ట్రీ పై ఎంతలా ప్రభావితం చేసిందో మనకి అర్థం అవుతుంది.