ఎన్నడు ఆగుతుందో తెలియదు ఉగ్రవాద యుద్ధం.ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు రావణ కాష్టం.
ఇది భారతదేశాన్ని కాపాడే సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర పోరాటం.అనుక్షణం అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ మాత్రం భరత మాత చల్లగా ఉంది.
లేదంటే రక్తసిక్తంతో తడిసి ముద్ద అవుతుంది.ఇలా అవడం లేదంటే దేశం కోసం సైనికులు ఆర్పించే ప్రాణాలే కారణం.
ఇకపోతే తాజాగా జమ్ముకాశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారట.ఈ మేరకు షోపియాన్ జిల్లాలోని హదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించాయట.
,/br>
ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై ఎదురుకాల్పులకు పాల్పడగా, జవానులు కూడా ఆత్మరక్షణార్ధం చేసిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా ఈరోజు తెల్లవారు జామున మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారిక సమాచారం.