ఇండియన్ సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్నారు.తమ టాలెంట్ తో అవకాశాలు సొంతం చేసుకొని కొంత మంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు.
హాలీవుడ్ లో చాలా మంది భారతీయ నటులు ఉనికి ఉంది.అయితే సౌత్ ఇండియా నుంచి హాలీవుడ్ లో మెరిసిన వారు చాలా తక్కువ మంది మాత్రమే.
రజినీకాంత్ గతంలో ఓ హాలీవుడ్ సినిమాలో పూర్తిస్థాయి పాత్రలో కనిపించాడు.ప్రస్తుతం రజినీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఓ హాలీవుడ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే ప్రియాంకా చోప్రా ఇప్పటికే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.సౌత్ ఇండియాలో తెలుగువాడైన ఆదర్శ్ గౌరవ్ ది వైట్ టైగర్ సినిమాలో కీలక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు.
అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా నటించిన వ్యక్తి కొడుకు కూడా హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నాడు.అయితే ఈ నటుడు ఇప్పటికే తెలుగు సినిమాలో కూడా తెరంగేట్రం చేయడం విశేషం.
కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సప్తపది సినిమాలో గిరీష్ ప్రాధాన్ హీరోగా నటించాడు.ఈ నటుడు అప్పటికే కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.
అయితే కళా తపసి విశ్వనాథ్ దృష్టిలో పడటంతో సప్తపది సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఆ తరువాత కూడా కొన్ని తెలుగు సినిమాలతో పాటు సౌత్ లో అన్ని బాషలలో నటించాడు.
అతని కొడుకు అమితాష్.ఇతను రఘువరన్ బిటెక్ సినిమాతో నటుడుగా తెరంగేట్రం చేశాడు.
ఆ సినిమాలో విలన్ గా మెప్పించాడు.తరువాత రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు.
తరువాత హార్ట్ బీట్స్ అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు.తరువాత మూడు తమిళ్ సినిమాలలో అమితాష్ నటించాడాడు.