మరో క్రేజీ సీక్వెల్‌కు రెడీ అంటోన్న డైరెక్టర్

టాలీవుడ్‌లో పెళ్లిచూపులు చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.ఆ తరువాత ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకు మంచి అంచనాలు ఏర్పడం అలవాటుగా మారిపోయింది.

 Ee Nagaraniki Emaindi Sequel For Sure-TeluguStop.com

ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు ఆ సమయంలో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉండటంతో ఈ సినిమా కొత్త ట్రెండ్‌ను సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు.

కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ పరంగా విజయం అందుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఆ సినిమాలో ఒక హీరోగా నటించిన విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

అయితే యూత్‌ను బాగా అలరించిన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని గతంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నాడు.దీంతో ఈ సీక్వెల్ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ తెలిపాడు.కాగా ఇటీవల ఈ సినిమాలో నటించిన అభినవ్ గోమటమ్ ఈ చిత్రం సీక్వెల్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అభినవ్ ఈ సినిమా సీక్వెల్ ఈ ఏడాది చివరికల్లా ప్రారంభం అవుతుందని, వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కావడం ఖాయమని ఆయన తెలిపాడు.మొత్తానికి ఈ నగరానికి ఏమైంది చిత్ర సీక్వెల్ విషయంపై ఓ క్లారిటీ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో మరింత ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్లు చిత్ర దర్శకుడు అంటున్నాడు.మరి ఈ సినిమాలో హీరోలుగా మళ్లీ ఆ నలుగురే నటిస్తారా లేక వేరే వారు నటిస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube