విక్టరీ వెంకటేశ్ కు రేచీకటి.. అసలేమైందంటే..?

ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటులలో విక్టరీ వెంకటేష్ ఒకరనే సంగతి తెలిసిందే.

ఎఫ్ 2లో అద్భుతంగా నటించి కడుపుబ్బా నవ్వించిన వెంకటేష్ ఎఫ్ 2లోని పాత్రలతోనే తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో కూడా నటిస్తున్నారు.చాలామంది ఈ సినిమాను సీక్వెల్ అని భావించినా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ కాదని చెప్పిన సంగతి తెలిసిందే.ఎఫ్3 సినిమాలో విక్టరీ వెంకటేష్ పాత్ర గురించి ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న వార్త ప్రకారం వెంకటేష్ ఈ సినిమాలో రేచీకటితో బాధ పడే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు.

టాలీవుడ్ లో గతంలో కొంతమంది కమెడియన్లు, హీరోలు రేచీకటితో బాధ పడే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.సాధారణ పాత్రలతోనే నవ్వించే వెంకీ రేచీకటి పాత్రలో ఓ రేంజ్ లో నవ్విస్తారేమో చూడాలి.గతంలో రవితేజను రాజా ది గ్రేట్ సినిమాలో అంధునిగా చూపించిన అనిల్ రావిపూడి ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు.ఎఫ్2లో కీలక పాత్రల్లో నటించిన నటీనటులంతా ఎఫ్3లో కూడా నటిస్తుండగా ఈ సినిమా కోసం హీరోలు, దర్శకునిగా రెమ్యునరేషన్ భారీ మొత్తంలో అందినట్టు తెలుస్తోంది.ఆగష్టు 27వ తేదీన ఎఫ్3 సినిమా విడుదల కానుంది.

దసరా పండుగకు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో మిగతా సినిమాల దర్శకనిర్మాలు ఆర్ఆర్ఆర్ కు ముందే తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఆగష్టు 13వ తేదీన పుష్ప సినిమా విడుదల కానుండగా రెండు వారాల గ్యాప్ లో పుష్ప సినిమా విడుదలవుతూ ఉండటం గమనార్హం.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు