సముద్ర గర్భంలో భార్య కోసం పదేళ్లుగా వెతుకుతున్న భర్త.. ఎందుకో తెలుసా ?

అతని పేరు యసువో తకామాట్సు.ఇతని భార్య యూకో.అతడికి తన భార్యంటే చాలా ఇష్టం.ఈమె బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది.వీరు జపాన్ లో నివసించేవారు.అయితే 2011 మార్చి 11 న వచ్చిన భారీ సునామీలో అతడి భార్య కనిపించకుండా పోయింది.

 Japan Man Looking For His Wife Into The Sea Who Is Lost In Tsunami 10 Years Ago,-TeluguStop.com

అయితే ఆమె కనపడకుండా పోయి 10 సంవత్సరాలు అవుతున్న ఆమె కోసం ఇంకా సముద్ర గర్భంలో గాలిస్తూనే ఉన్నాడు.

అతడు చెబుతున్న దాని ప్రకారం.

ఆ రోజు తన భార్య ఎప్పటిలాగానే బ్యాంకులో ఉద్యోగానికి వెళ్ళింది.సునామీ వచ్చిన సమయంలో ఆమె తన భర్త ఫోనుకు ఒక మెసేజ్ పంపించింది.

నువ్వు ఎలా ఉన్నావ్.? నాకు ఇంటికి రావాలని ఉంది.అని మెసేజ్ పంపించింది.అప్పటికే సునామీ కారణంగా ఎంతో మంది చనిపోయారు.అయితే ఆ మెసేజ్ చుసిన యసువో తన భార్య బతికే ఉందని అనుకున్నాడు.

అయితే ఆ మెసేజ్ పంపిన తర్వాత ఆమె ఫోన్ కలవలేదు.

అప్పటికే విద్యుత్, మొబైల్ సేవలన్నీ నిలిచి పోవడంతో యసువో తన భార్య ఆచూకీ కనిపెట్టలేక పోయాడు.అయితే సునామీ కాస్త తగ్గిన తర్వాత తన భార్యను వెతుక్కుంటూ బ్యాంకు దగ్గరకు వెళ్ళాడు.

అయితే అక్కడికి వెళ్లిన యసువో బ్యాంకు కనిపించకపోవడంతో అతడు కన్నీరుమున్నీరయ్యారు.

Telugu Fukushima, Japan, Japantsunami, Sea, Tsunami-Latest News - Telugu

సునామీలో కొట్టుకుపోయిందని తెలుసుకున్నాడు.అయినా అతడు తన భార్య పార్థివ దేహాన్ని చూసే వరకు నమ్మలేనని.ఆమె కోసం 10 సంవత్సరాలుగా వెతుకుతున్నాడు.

బ్యాంకు చుట్టూ పక్కల మొత్తం వెతికాడు.తర్వాత సముద్రంలో వెతకడం మొదలు పెట్టాడు.

తన భార్య కోసం వెతుకుతుంటే 10 మంది అస్థికలు కనిపించాయి.వాటిని వారి కుటుంబ సభ్యులకు అందించాడు.

ఈ గాలింపులో అతడి భార్యకు సంబంధించి కొన్ని వస్తువులు దొరికాయికానీ ఆమె ఆచూకీ మాత్రం తెలియలేదు.అయితే అతడికి ప్రస్తుతం 64 సంవత్సరాలు.అతడు తనకు ఓపిక ఉన్నంతకాలం తన భార్య కోసం వెతుకుతూనే ఉంటా.అని యసువో చెప్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube