కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేసిన సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలో నటించిన సోను సూద్ కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి ప్రజల గుండెల్లో రియల్ హీరోగా నిలిచాడు.
కొందరు సోను సూద్ పై ఉన్న అభిమానంతో అతనికి గుడి కూడా కట్టించారు.మరికొందరు మాత్రం చిన్న అవకాశం దొరికితే చాలు సోను సూద్ గురించి నెగిటివ్ గా ట్రోల్ చేయడం ప్రారంభిస్తారు.
ప్రస్తుతం నెటిజన్లు ఓ విషయంలో సోనూసూద్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని పలువురు సెలబ్రిటీలు అందరూ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నేపథ్యంలోనే సోనూసూద్ శివరాత్రి పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో శివుడి ఫోటోలను ఫార్వర్డ్ చేయడానికి బదులుగా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడింది అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.అయితే సోను సూద్ చేసిన ఈ ట్వీట్ ను కొందరు తమ మనోభావాలను దెబ్బతీసేలా సోను సూద్ ట్వీట్ చేశారని భావించి,ఆయనని హూ ద హెల్ ఆర్ యు సోనూసూద్ (#WhoTheHellAreUSonuSood) అనే హ్యాష్‌ట్యాగ్‌తో దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.
అయితే మరికొందరు మాత్రం సోను సూద్ చేసిన ట్వీట్ ను పాజిటివ్ గా ఆలోచించి ఐ సపోర్ట్ సోను సూద్ అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండింగ్ లో ఉంచారు.ఈ విధంగా సోనుసూద్ పై ట్రోల్ చేయడం ఇదే మొదటిసారి కాదు.ఇదివరకే ఇలాంటి ట్రోలింగ్స్ భారీగానే జరగగా, వాటిపై స్పందించిన సోనూసూద్ నేను సామాన్యుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటాను.మానవత్వంతో కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడమే నా విధి అని తెలియజేస్తూ మరోసారి తన మంచి మనసును, మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సోను సూద్ తెలుగులో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో విలన్ పాత్రలో సందడి చేయనున్నారు.