మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు పూనకాలు వస్తుందంటే అతిశయోక్తి కాదు.తన డ్యాన్స్, యాక్టింగ్ తో తనకు తానుగా ఒక వృక్షంలా ఎదిగిన గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి.
అయితే మెగా వారసుడుగా అల్లు అర్జున్, రాంచరణ్, వరుణ్ తేజ్ ఇలా చాలా మంది మెగా వారసులుగా సినీ ఎంట్రీ ఇచ్చారు.మెగా వారసులుగా వచ్చిన ప్రతి ఒక్కరు వెండితెర మీద భిన్నమైన కథలను ఎంచుకుంటూ తమదైనా రీతిలో అభిమానులను అల రిస్తున్నారు.
అయితే తాజాగా మెగా వారసుడిగా హీరోగా లాంచ్ అయిన హీరో వైష్ణవ్ తేజ్.
అయితే తాను నటించిన మొదటి సినిమా ఉప్పెన.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన వైష్ణవ్ తేజ్ వందకోట్ల గ్రాస్ ను అందుకుంది.అయితే చిరంజీవికి ఉన్న గొప్ప లక్షణం ఏమనగా ఎవరైనా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తే వారికి ఏదో ఒక కానుకనిచ్చి అభినందిస్తారు.
ఇది మెగాస్టార్ కి ఉన్న గొప్ప లక్షణం.అయితే ఈ సందర్బంగా ఉప్పెన టీమ్ ని చిరంజీవి అభినందించారు.
డైరెక్టర్ కు, హీరోయిన్ కు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీకి తన అభినందన లేఖతో పాటు చిరు కానుకను అందించారు.అయితే తన మేనల్లుడు అయిన వైష్ణవ్ తేజ్ కి అత్యంత ఖరీదైన వాచ్ ను బహుకరించారు.
ఇక చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ కు వైష్ణవ్ తేజ్ స్పందిస్తూ థాంక్స్ మామా అని ట్వీట్ చేసాడు.