వైరల్ వీడియో: జిప్ ఫెయిలైందా..?! ఐతే ఇలా చేయండి..!

మనం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్ట నష్టాలను ఎదుర్కుంటూ ఉంటాము.ఒక్కోసారి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొంటాం.

 A Tiktok User Shows How To Fix Failed Zip, Zip Fails, Viral Video, 60 Secs, Fixe-TeluguStop.com

అయితే వాటిని ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటపడేందుకు మనం ఎంతో కృషి చేస్తాం.అయితే కొన్ని సార్లు చిన్నచిన్న విషయాలే ఎక్కువగా కలవరపెడుతూ ఉంటాయి.

అలాంటి సమయాల్లో ఏమి చేయాలో, ఎలా ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియదు.ఒక్కోసారి పని మీద బయటకు వెళ్లే సమయంలో జిప్ ఫెయిల్ అవటం వలన పడే కష్టాలు కూడా అలాంటివే మరి.

జిప్ (Zip) ఫెయిలవ్వడం వల్ల దాదాపు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు.ఇది చూడడానికి చిన్న సమస్యలా అనిపించినా గాని, ఇది ఫేస్ చేసే వారికి మాత్రం పెద్ద సమస్యగానే ఉంటుంది.

ఒక్కోసారి ఈ విషయంలో చిరాకు, అసహనం కూడా వస్తుంది.ఏం చేయాలో తెలియక కోపం వస్తుంది.అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఒక సరికొత్త పద్దతిని కనిపెట్టాడు.అది ఏంటంటే ఫెయిలైన జిప్​ను కేవలం 60 సెకన్లలోనే సరిచేసే పద్ధతిని సోషల్ మీడియాలో ఓ యూజర్ వివరించారు.

మొదటగా టిక్​ టాక్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో మెల్లగా అన్నీ సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోంది.ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

 ఫెయిలైన జిప్​ను ఎలా సరిచేసుకోవాలో అతడు ఈ వీడియోలో చూపించాడు.కొత్త జిప్ కొనుక్కోకుండా ఇంట్లోనే ఉండే పరికరాలతోనే విరిగిపోయిన జిప్​ను ఎలా సరిచేసుకోవచ్చో వివరించాడు.

ఇందుకోసం జిప్ ఉన్న బూట్లను ఇతను వినియోగించాడు.ఫెయిలైన జిప్​ ను విజయవంతంగా సరి చేసి చూపించాడు.

“జిప్​ను ఒరిజనల్ పొజిషన్​ కు తీసుకురావడం ముఖ్యం.అందుకే కొసలు విడిపోయిన జిప్ రన్నర్​ పై సుత్తితో నెమ్మదిగా కొట్టాలి.అలా అని మరీగట్టిగా కొడితే జిప్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది”అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పాడు.అలాగే ఆ వ్యక్తి సుత్తితో కొట్టేటప్పుడు జారిపోకుండా జిప్​రన్నర్​ ను అతడు కటింగ్ ప్లేయర్​ తో పట్టుకున్నాడు.

ఇలా జిప్​ రన్నర్​ను సుత్తితో కొట్టేటప్పటికీ జిప్​ మళ్లీ బాగా పని చేసింది.మొత్తానికి చెడిపోయిన జిప్​ను అతడు 60 సెకన్లలోనే మాములు స్థితికి తెచ్చాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది.ఈ వీడియో చూసి వందలాది మంది అతడికి కామెంట్ల రూపంలో అభినందనలు తెలియచేసారు.

చాలా మంది అతనికి థ్యాంక్స్ కూడా చెప్పి అభినందిస్తున్నారు.! మరి మీరు కూడా ఈ టిప్స్ పాటించి చుడండి.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube