రక్తహీనత.ఐరన్ లోపించడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు సంఖ్య పడిపోతుంది.దాన్నే రక్త హీనత అంటారు.ముఖ్యంగా ఆడవారు, పిల్లల్లో రక్త హీనత సమస్య ఎక్కువగా ఉంటుంది.రక్త హీనత సమస్య ఏర్పడిందంటే.నీరసం, అలసట, ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, చర్మం పాలిపోవడం, సీజన్‌తో పని లేకుండా శరీరం చల్ల బడటం ఇలా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే ఎప్పుడూ రక్త హీనత సమస్యను నిర్లక్ష్యం చేయరాదు.
అయితే రక్త హీనతను నివారించడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
అందులో గోరు చిక్కుడు ఒకటి. అవును, గోరు చిక్కుడులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి, రక్త హీనత సమస్యతో బాధ పడేవారు వారానిరికి రెండు సార్లు గోరు చిక్కుడుని తీసుకుంటే గనుక.రక్త వృద్ధి జరుగుతుంది.
ఫలితంగా రక్త హీనత సమస్యకు చెక్ పెవచ్చుకు.ఇక గోరు చిక్కుడు తో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
గర్భణీలకు గోరు చిక్కుడు అద్భుతమైన ఆహారమని చెప్పాలి.ఎందుకంటే, గోరు చిక్కుడులో ప్రొటీన్స్, ఫైబర్, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె ఇలా ఎన్నో పోషకాలు.పిండం అభివృద్ధి మెరుగుపరుస్తుంది.మరియు డెలివరీ సమయంలో వచ్చే సమస్యలను దూరం చేయడంలోనూ గోరు చిక్కుడు ఉపయోగపడుతుంది.అలాగే బరువు తగ్గాలని భావించే వారు గోరు చిక్కుడును డైట్లో చేర్చుకుంటే మంచిది.
ఎందుకంటే, ఫైబర్ ఎక్కువగా.
కేలరీలు తక్కువగా ఉంటాయి.కాబట్టి, గోరు చిక్కుడును తరచూ తీసుకుంటే.
వెయిట్ లాస్ అవ్వొచ్చు.ఇక గోరు చిక్కుడును తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
దాంతో గుండె సంబంధిత జబ్బులకు దూరంగా ఉండొచ్చు.గోరు చిక్కుడు తీసుకోవడం వల్ల.
అందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.