టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్‌స్టోరి ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకునేందుకు చైతూ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని వైవిధ్య చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పటికే ‘థ్యాంక్ యు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా నాగచైతన్య త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి వాకౌట్ చేశాడట.దీంతో ఈ సినిమాలో నటించేందుకు నాగచైతన్యను సంప్రదించారట చిత్ర యూనిట్.కాగా ఈ సినిమా ఆఫర్ గురించి నాగచైతన్య నుండి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.దీంతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న చైతూ, లవ్ స్టోరి చిత్రంతో తన సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన స్టయిల్‌లో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.
పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి అక్కినేని బుల్లోడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.
మరి త్రండి బాటలో చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.