గులాభి పార్టీలోని నేతలకు కాస్త దూకుడు ఎక్కువే అన్న పేరు ఇప్పటికే ప్రచారంలో ఉందన్న విషయం తెలిసిందే.ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఇదివరకు ఎందరో నేతలు దురుసుగా ప్రవర్తించారు కూడా.
ఇప్పటికీ ఆ దూకుడుకు బ్రేకులు పడకపోవడం అప్పుడప్పుడు గులాభి బాస్‌కు తలనొప్పిగా మారిందట.
ఇదివరకే అక్కడక్కడ టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్న క్రమంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట.
ఆయన తన నియోజవర్గంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారట.అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ లో నిర్మించే ఆలయంకోసం మనంఎందుకు విరాళాలు ఇవాలని ప్రశ్నించారట పనిలో పనిగా మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అంటూ కొత్త వివాదానికి తెరలేపారట.ఇక బీజేపీని ఉద్దేశిస్తూ నిధులు సేకరించడానికి భిక్షం ఎత్తుకుంటూ రాముని పేరును వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారట.ఇంతలోనే మాట మారుస్తూ బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులం అనడం తప్పు తామంత కూడా శ్రీరాముని భక్తులమేనని వెల్లడించారట.
కాగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల రామ భక్తులు, హిందూసంఘాల నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పై మండి పడుతున్నారట.