చాలా మందికి విన్యాసాలు, సాహసాలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.అంతే కాకుండా సాహసాలను రకరకాలుగా చూపిస్తారు.
ఎత్తు నుండి కిందకు దిగడం, గోడలను ఎక్కడం, బరువులను ఎత్తడం ఇలా ఎన్నో రకాలుగా చేస్తుంటారు.తమకు సాహసం లో ఆసక్తి ఉంటే వాళ్లు ఏం కోల్పోయిన వాటిని మాత్రం వదలరు.
ఇలాగే ఓ వ్యక్తి కూడా తన కాళ్లు కోల్పోయిన సాహసం మాత్రం వదలని వీరుడు గా నిలిచాడు.
హాంకాంగ్ కు చెందిన సాహసి లై చి. ఈయన వయసు 35 సంవత్సరాలు.రాక్ క్లైంబింగ్ లో నాలుగు సార్లు ఏషియన్ ఛాంపియన్ గా నిలిచాడు.
తన సాహసంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాగా ఇతనికి ఓ ప్రమాదం వల్ల తన కాళ్లను కోల్పోయాడు.10 సంవత్సరాల క్రితం కారు యాక్సిడెంట్ లో తను కాళ్ళను కోల్పోయాడు.దీనివల్ల వీల్ చైర్ కు పరిమితం అయ్యాడు.
దీనివల్ల కొన్ని రోజులు సాహసాలకు దూరంగా ఉన్నాడు.కాని తన వీల్ చైర్ నే సాహసం గా మార్చుకున్నాడు.
తన శక్తితో ఐదు సంవత్సరాల క్రితం 495 మీటర్ల లైన్ ట్రాక్ పర్వతాన్ని వీల్ చైర్ తోనే ఎక్కి ధైర్య సాహసాన్ని చూపించాడు.
తాజాగా మరోసారి రాక్ క్లైంబింగ్ ను చేయడానికి ముందుకు రాగా 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్ ను వీల్ చైర్ తోనే ఎక్కి మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఈ విధంగా లై చి మాట్లాడుతూ “ఈ సాహస ప్రయాణంలో నేను దివ్యాంగుడు నని ఆలోచన ఎప్పుడూ రాలేదు.పర్వతాన్ని అధిరోహించడం కంటే అద్దాల ఆకాశ హర్మ్యాన్ని అధిరోహించడం కష్టమని” తెలిపాడు.
కాగా అతని సాహసానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.