ఈ దశాబ్దపు సారధులు ధోని, కోహ్లీలే..!

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డిసెంబర్ 27వ తేదీన ‘ఐసీసీ టీమ్‌ ఆఫ్ ది డెకెడ్’ పేరిట ఈ దశాబ్దంలో అత్యుత్తమ క్రికెట్ జట్లను, ఆటగాళ్లను ప్రకటించి అవార్డులను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.అయితే దీంట్లో ఇండియన్ క్రికెట్ టీమ్ కే ఎక్కువ గా అవార్డులు లభించాయి.

 Dhoni And Kohli Are The Captains Of This Decade, Dhoni, Virat Kohli, Captains, D-TeluguStop.com

‌వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోనీ సారథిగా, వికెట్ కీపర్ గా ఎంపికయ్యారు.టెస్టు జట్టుకు మాత్రం కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

ఈ దశాబ్దం లో అత్యుత్తమ టీ20 క్రికెట్ జట్టులో ధోనీ, కోహ్లీతో పాటు ఓపెనర్‌ రోహిత్ శర్మ, పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.భారత క్రికెటర్లలను మినహాయించి టీ 20 జట్టు లో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, కీరోన్ పొలార్డ్, రషీద్ ఖాన్, లసిత్ మలింగ ఉన్నారు.

అలాగే వన్డే ఫార్మాట్‌ జట్టు లో ధోనీ, రోహిత్‌, కోహ్లీ ఉన్నారు.వన్డే జట్టులో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ లను ఓపెనర్లుగా ఎంపిక చేయగా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఎబి డివిలియర్స్ ని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మాన్ గా ఎంపిక చేశారు.

వన్డే జట్టు లో ఆల్ రౌండర్లు గా బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్, ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఎంపికయ్యారు.ఈ దశాబ్దపు టెస్టు జట్టులో ఇండియన్ క్రికెట్ టీమ్ తరఫున కోహ్లీ, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ చోటు దక్కించుకున్నారు.

Telugu Captains, Decade, Dhoni, Day, Farmets, Virat Kohli-Latest News - Telugu

మరోవైపు ఐసీసీ ప్రకటించిన మహిళల జట్టులో భారత్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.టీ20 ఫార్మాట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్; వన్డే జట్టులో మిథాలీ రాజ్‌, జులన్ గోస్వామి చోటు సంపాదించారు.రెండు జట్లకు కెప్టెన్‌ ఆస్ట్రేలియా క్రికెటర్‌ మెగ్ లానింగ్.

ఐసీసీ ఉమెన్స్ వన్డే టీం ఆఫ్ ది డికేడ్ తీసుకుంటే.

మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), అలిస్సా హీలీ, సుజీ బేట్స్, మిథాలీ రాజ్, స్టాఫానీ టేలర్, సారా టేలర్, ఎల్లిస్ పెర్రీ, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, జులాన్ గోస్వామి, అనిషా మొహమ్మద్ ఉన్నారు.

ఐసీసీ ఉమెన్స్ టీ20 ఐసిసి టీమ్ ఆఫ్ ది డికేడ్ చూసుకుంటే.

మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), అలిస్సా హీలీ, సోఫీ డెవిన్, సుజీ బేట్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్టాఫానీ టేలర్, డియాండ్రా డాటిన్, ఎల్లిస్ పెర్రీ, అన్య ష్రబ్‌సోల్, మేగాన్ షుట్, పూనమ్ యాదవ్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube