2020 మనకి అంతగా కలిసిరాలేదని చెప్పాలి.కరోనా మహమ్మారి వలన ఎంతోమంది ఎన్నో మిస్ అయ్యారు.
అన్ని ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి.ఇక సినీమా ఇండస్ట్రీ గురించి అయితే చెప్పనక్కర్లేదు.
ఈ కరోనా వలన సినిమాలన్నీ ఆగిపోయి.థియేటర్స్ లేక సినిమావాళ్ళు ఎన్నో కష్టాలు పడడంతో పాటు కొంతమంది సినిమా లెజండరీస్ ని కూడా మనం కోల్పోయాం.అలా మననుండి దూరమైన కొంతమంది సినీ ప్రముఖులను ఒక్కసారి గుర్తుచేసుకుని ప్రయత్నం చేద్దాం.
1.యస్ పి బాలసుబ్రమణ్యం
ఈ లిస్ట్ లో మనం ముందుగా SPB గారి గురించి మాట్లాడుకోవాలి.భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని భాషలలోనూ పాటలు పాడి.గాన గాంధర్వుడుగా ఒక వెలుగు వెలిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జూన్ 4, 1946 సంవత్సరంలో జన్మించారు.అయితే సెప్టెంబర్ 25, 2020న కరోనాతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లోచేరిన ఆయన ఒక నెల రోజుల పాటు హాస్పటల్ లోనే పోరాడి చికిత్స పొందుతూ 29 సెప్టెంబర్ 2020న కన్నుమూశారు.ఈయన మననుండి దూరమైన ఆయన పాటలు మాత్రం నేటికీ ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉంటాయి.
2.ఇర్ఫాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో 29 ఏప్రిల్ 2020న మరణించారు.ఈయన విభిన్నమైన పాత్రల్లో నటించి వరల్డ్ వైడ్ గా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇర్ఫాన్ గారు.తీవ్ర అనారోగ్యంతో ముంబాయిలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ హాస్పిటల్‌లో చేరారు.54 ఏళ్ల వయసులో హాస్పటల్ లో చేరిన ఇర్ఫాన్ ఖాన్ ను డాక్లర్టు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినపటికి ఆయన కోలుకోలేదు.ఇర్ఫాన్ ఖాన్ కొన్ని రోజుల పాటు ‘న్యూరోఎండోక్రిన్ ట్యూమర్’ అనే విచిత్రమైన క్యాన్సర్ వ్యాధితో లండన్‌లో చికిత్స తీసుకున్నాడు.అది కోలుకున్నట్టే కోలుకొని మళ్ళీ ఎఫెక్ట్ చూపించడం వలన అయన మన నుండి 2020లో దూరమయ్యారు.
3.చాడ్విక్ బోస్మాన్
‘బ్లాక్ పాంథర్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మనల్ని ఎంతోగాను అలరించిన చాడ్విక్ బోస్మాన్ కూడా మనం ఈ 2020 లో కోల్పోయాం.గత నాలుగేళ్లుగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో పోరాడుతున్న చాడ్విక్ మరణించాడని ఆయన కుటుంబం సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.
4.రిషి కపూర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గారు కూడా ఏప్రిల్ 30, 2020 లో మరణించారు.ఈయన కూడా చాలా సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.రిషి కపూర్ క్యాన్సర్ ను తగ్గించడానికి చేయని ప్రయత్నం లేదు.ఇక చేసిన ప్రయత్నాల్లో ఓడిపోయి క్యాన్సర్ కి లొంగిపోయి మరణించారు.
5.సరోజ్ ఖాన్
దాదాపు 40 ఏళ్లపాటు ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్ గా ఎన్నో సేవలందించిన లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు.అనారోగ్యంతో జూన్ 20, 2020న ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూనే.శ్వాసకు సంబంధిత సమస్య రావడంతో అక్కడికక్కడే మరణించారు.బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా 3 జాతీయ అవార్డులు అందుకున్నారు.డోలా రె డోలా (దేవ్‌దాస్), తను వెడ్స్ మను రిటర్న్స్, మణికర్ణిక, ఏ ఇష్క్ హాయే (జబ్ వి మెట్) వంటి చిత్రాలు సరోజ్ కు గుర్తింపు తీసుకొచ్చాయి.
6.సుశాంత్ సింగ్ రాజపుత్
బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకున్నారు.ఈయన మరణానికి వరల్డ్ వైడ్ గా అయన అభిమానులంతా సంతాపం తెలియజేసారు.
7.జయప్రకాష్ రెడ్డి
తెలుగు సినిమా బతికున్నంత వరకు కొంతమంది నటులు వాళ్ళ సినిమాల ద్వారా జీవిస్తూనే ఉంటారు.అలాంటి నటులలో సినియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కూడా ఒకరు.అయితే ఆయన ఇటీవలే గుండెపోటుతో మరణించారు.గుంటూరులోని తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు.ఈయన 1946 అక్టోబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సిర్వేల్ లో జన్మించారు.