ఆహా ఓటిటి వేదికగా స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ పేరుతో టాక్ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు సామ్ జామ్ షో కు హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా సామ్ జామ్ షో కు హాజరు కాగా ఆ ఎపిసోడ్ రాబోయే వారాల్లో ప్రసారం కానుంది.స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా సామ్ జామ్ షో కు తాజాగా హాజరయ్యారని తెలుస్తోంది.
సమంత సామ్ జామ్ టాక్ షో గురించి గతంలో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఈ షోకు గెస్ట్ గా హాజరు కానున్నట్టు చెప్పగా ఇప్పటికే అల్లు అర్జున్ సామ్ జామ్ షోకు వచ్చారని అతి త్వరలో అల్లు అర్జున్ హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ త్వరగా ప్రసారమైతే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
టాక్ షో ద్వారా సమంత అల్లు అర్జున్ కి సంబంధించిన ఏయే సీక్రెట్ లను బయట పెడతారో చూడాల్సి ఉంది.

లాక్ డౌన్ ముందు వరకు వరుస సినిమా కమిట్మెంట్ లతో బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు సామ్ జామ్ షో ను హోస్ట్ చేస్తున్నారు.ఈ సంవత్సరం సమంత ప్రధాన పాత్రలో నటించిన జాను సినిమా విడుదల కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.కొత్త కథలు వింటున్న సమంత ఇప్పటివరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

మరోవైపు అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు.పుష్ప సినిమా యూనిట్ సభ్యులలో కొంతమందికి కరోనా సోకడంతో పుష్ప సినిమా షూటింగ్ వాయిదా పడింది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.2021 సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది
.