ఇక్కడ తిట్లు .. అక్కడ వినయం ! కేసీఆర్ ఢిల్లీ పాలి 'టిక్స్' ?

ఎప్పుడూ ఊహించని విధంగా ట్విస్ట్ లు ఇస్తూ,  రాజకీయం చేయడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాగా అలవాటు.మొదటి నుంచి ఇదే వైఖరితో ఉంటూ వస్తున్నారు.

 Kcr Meeting Bjp Leaders In Delhi Kcr Meeting Key Bjp Leaders In Delhi, Greater E-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణలో తమకు రాజకీయ బద్ధ శత్రువు గా మారిన బీజేపీని ఇక్కడ బలోపేతం అవ్వకుండా చూడడమే ఏకైక లక్ష్యంగా కెసిఆర్ వ్యూహాలు పన్నుతున్నారు.పార్టీ శ్రేణులను దానికి అనుగుణంగా సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

మొన్నటి వరకు దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ లో హోరా హోరీ గా జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ బిజెపి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.బిజెపి అగ్రనేతలు అంతా హైదరాబాద్ కు క్యూ కట్టి మరి కెసిఆర్, ఆయన పరిపాలనను తిట్టిపోసి మరీ వెళ్లారు .దీంతో కెసిఆర్ బీజేపీ అగ్రనేతలకు మధ్య రాజకీయ వైరం మొదలైపోయింది అని, ఇక కెసిఆర్ ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశమే లేదు అని ఇలా ఎన్నో రకాల విశ్లేషణలు జరుగుతూ వస్తున్నా, కెసిఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం అక్కడ బిజెపి అగ్రనేతలు వారిని కలవడం , వారితో ఏకాంతంగా చర్చలు జరపడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.

ఎప్పుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా, పార్టీకి చెందిన నాయకులు కొందరు ఆయన వెంట వెళ్లి ఆ సమావేశాల్లోనూ పాల్గొంటూ ఉండేవారు.

అయితే ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఎవరినీ వెంట తీసుకెళ్లలేదు.అధికారులను మాత్రమే తీసుకెళ్లారు.అది కూడా కొన్ని అంశాలకే వారిని పరిమితం చేశారు.తెలంగాణకు సంబంధించి నిధులు ,వివిధ సమస్యల పైన చర్చలు జరిపిన సమయంలో అధికారులు వెంట ఉన్నారు.

కానీ అమిత్ షా వంటి వారితో ఆయనొక్కరే భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.కెసిఆర్ ను రాజకీయ బద్ధశత్రువుగా చూస్తున్న బీజేపీ , బీజేపీ ని అదేవిధంగా చూస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఏకాంతంగా చర్చలు జరుపుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

మామూలుగా కేంద్ర బిజెపి పెద్దల అపాయింట్మెంట్లు దొరకడం చాలా కష్టం.

Telugu Amit Shah, Delhi, Dhubaka, Greater, Shekhawath, Telangana-Political

ఏపీ సీఎం జగన్ సైతం అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి అపాయింట్మెంట్లు దొరక్క వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి అమిత్ షా,  మోదీ వంటి పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎంతగా ప్రయత్నించినా, ఆయనకు దక్కలేదు.కానీ రాజకీయ శత్రువుగా ఉన్న కెసిఆర్ కు వెంటనే అపాయింట్మెంట్ దొరకడం , చర్చలు జరగడం వంటివి ఆసక్తి కలిగిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube