ప్రపంచం మొత్తం పాకి పోయిన కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు అందరూ నిరంతరం కృషి చేస్తూ వ్యాక్సిన్ ను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు.
అయితే కొందరు ఈ టీకా పై పలు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదా? మాస్కులు ధరించకుండా బయట తిరగవచ్చా? భౌతిక దూరం అవసరం లేదా? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి.అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తలు స్పందించి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మరి కొంత కాలం పాటు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
సాధారణంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటి డోసు ఫైజర్ టీకా తీసుకున్న తర్వాత దాదాపు రెండు వారాల పాటు ఈ టీకా ప్రభావం ఉంటుంది.తరువాత రెండవ డోసును మొడెర్నా తీసుకున్నప్పుడు దీని ప్రభావం చూపడానికి నాలుగు వారాల సమయం పడుతుంది.
ఏవైనా టీకాలు తీసుకున్నప్పుడు వాటి ప్రభావం వెంటనే చెప్పకుండా కొంత సమయం తీసుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుడు డెబోరా ఫుల్లర్ తెలిపారు.
టీకా తీసుకున్న తర్వాత కరోనా జాగ్రత్తలు పాటించకపోతే కరోనా వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.కాబట్టి టీకా వేసుకున్న కూడా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత టీకా తీసుకున్నవారిలో ఈ వ్యాధిని అరికడుతుందా లేక కేవలం లక్షణాలను మాత్రమే కనపడకుండా చేస్తుందా అనే విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
అయితే వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉన్నప్పటికీ, వ్యాక్సినేషన్ తరువాత శరీరంలో రోగనిరోధక శక్తి మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.