సెట్స్ ‌లోకి అడుగుపెట్టనున్న 'రాఖీభాయ్' !

రాఖీభాయ్ .కన్నడ సినిమా ఇండస్ట్రీలో మొదలైన ఈ ప్రస్థానం ఆ తర్వాత యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.

 Yash In Kgf 2 Sets In Soon Kgf 1, Kgf2 , Yash, Kartik, Sanjaydath,kannada-TeluguStop.com

ఓ చిన్న సినిమాగా మొదలైన కేజీఎఫ్ చాఫ్టర్ 1 .పాన్ ఇండియా చిత్రంగా విడుదలై , విడుదలైన ప్రతిచోటా కూడా ఘనవిజయాన్ని నమోదు చేసింది.హీరోయిజం చూపించడంలో కొత్తగా ప్రజెంట్ చేయడంతో సినిమాని అభిమానులు బాగా ఆదరించారు.

రాకింగ్‌స్టార్‌ యష్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1 కి కొనసాగింపుగా రూపొందుతోన్న చిత్రం కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2. కరోనా‌ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ ఈ మధ్య మళ్లీ ప్రారంభం‌ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ షెడ్యూల్‌ లో చిత్ర యూనిట్‌ తో హీరో యష్‌ గురువారం నుండి జాయిన్ అవుతున్నారు.

ఈ విషయాన్ని నిర్మాత కార్తీక్‌ గౌడ ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఈ నెలాఖరుకంతా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని, త్వరలోనే రిలీజ్‌ డేట్ ఫై ఓ కీలక ప్రకటన చేస్తామని కార్తీక్ తెలిపారు.

అయితే ,సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌.

అధీరా అనే విలన్‌ పాత్రలో నటిస్తుండగా, రవీనాటాండన్ ‌లు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube