లోకల్ ఛానెల్‌కు రీసౌండ్ వినిపించేలా చేసిన నిశ్శబ్ధం

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడో థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

 Nishabdham Team Sues Hyderabad Local Channel, Nishabdham, Anushka, Hemanth Madhu-TeluguStop.com

కోన వెంకట్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దింది.అయితే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో చిత్ర యూనిట్ నిరాశకు లోనయ్యారు.

అయితే తాజాగా నిశ్శబ్ధం చిత్ర యూనిట్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానల్ చుక్కలు చూపించింది.ఇటీవల నిశ్శబ్ధం చిత్రం ఓటీటీలో రిలీజ్ కావడంతో ఈ సినిమాను హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో ఈ విషయం నిశ్శబ్ధం చిత్ర యూనిట్ సభ్యులకు తెలిసింది.వారు వెంటనే సదరు ఛానల్‌పై దావా వేసింది.తమ సినిమాను ఎలాంటి పర్మిషన్ లేకుండా సదరు ఛానల్‌లో ఎలా ప్రసారం చేస్తారని వారిపై మండిపడింది.దీంతో సదరు టీవీ ఛానల్ తమకు రూ.1.1 కోట్లు చెల్లించేలా నిశ్శబ్ధం చిత్ర యూనిట్ లీగల్ నోటీసులు పంపించింది.

అంతేగాక ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా సదరు ఛానల్‌పై రూ.30 లక్షల దావా వేసింది.దీంతో ఆ లోకల్ ఛానల్‌కు గూబ గుయ్యిమంది అని సినీ వర్గాలు అంటున్నాయి.ఏదేమైనా ఒక స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాను లోకల్ ఛానల్‌లో చడీ చప్పుడు కాకుండా టెలికాస్ట్ చేస్తుంటే, ఈ ఛానల్ వారు ముందు హడావుడి చేయాలని భావించి క్షవరం చేయించుకోవాల్సి వచ్చింది.

ఇకనైనా లోకల్ ఛానళ్లు ఈ విషయంపై క్లారిటీగా ఉంటారో లేదో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube