బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 గత సీజన్లలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది.ప్రతిరోజూ కొత్త ప్రోమోలతో స్టార్ మా నిర్వాహకులు రేటింగ్ పెంచాలని ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం లేదు.
మరోవైపు ఈ సీజన్ లో గంగవ్వను బిగ్ బాస్ హౌస్ కు తీసుకొనివచ్చి షో నిర్వాహకులు పెద్ద తప్పే చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్ నుంచి అభిజిత్, సొహైల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా గ్లోరీ, అఖిల్, నోయల్ నామినేట్ అయ్యారు.
గంగవ్వకు బయట భారీగా ఫాలోయింగ్ ఉందని తెలిసి గంగవ్వను నామినేట్ చేయాలని ఎవరూ అనుకోవడం లేదు.అయితే గంగవ్వ వల్ల షోలో మిగతా కంటెస్టెంట్లకు అన్యాయం జరుగుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రియాలిటీ షో అంటే ఒక్కో కంటెస్టెంట్ కు ఒక్కో తరహా నిబంధనలు ఉండకూడదు.గంగవ్వను నామినేట్ చేసినా సింపతీ వర్కవుట్ అయ్యి ఆమెకు ఓట్లు వస్తున్నాయి.గంగవ్వ ఫిజికల్ టాస్కులలో పాల్గొనదు.దీంతో బిగ్ బాస్ అన్ ఫెయిర్ గేమ్ అని.షోకు గంగవ్వే మైనస్ గా మారుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు కొందరు కంటెస్టెంట్లు గంగవ్వతో సన్నిహితంగా మెలుగుతూ ఓట్లు పొందాలని భావిస్తున్నారు.
ఫలితంగా ఆ ప్రభావం బిగ్ బాస్ షోపైనే పడుతోంది.టాలెంట్, గుర్తింపు ఉన్న కంటెస్టెంట్లు సైతం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు.గంగవ్వ వల్ల గత సీజన్లకు, ఈ సీజన్ కు చాలా తేడా వచ్చిందని గంగవ్వను నామినేట్ చేయాలంటే హౌస్ మేట్స్ భయపడాల్సిన పరిస్థితి నెలకొందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.