మొన్న తిట్లు.. నిన్న‌ పొగ‌డ్త‌లు.. అవినాష్, మోనాల్ క‌థ‌లో సూప‌ర్ ట్విస్ట్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ సెప్టెంబ‌ర్ 6న ప్రారంభ‌మై.రెండు వారాలు పూర్తి చేసుకుంది.

 Monal Gajjar And Avinash Love Track In Bigg Boss! Monal Gajjar, Avinash, Love Tr-TeluguStop.com

ఇప్ప‌టికే వైల్డ్ కార్డు ద్వారా కుమార్ సాయి, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా.మొద‌టి వారం ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్‌, రెండు వారం క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.

ఇక‌ ప్ర‌స్తుతం మూడో వారంలోకి అడుగుపెట్టిన ఇంటి స‌భ్యులు కాస్త జోష్ పెంచి టాస్కులు, గొడ‌వ‌ల‌తో.షోను హీటెక్కిస్తున్నారు.
ఇదే స‌మ‌యంలో బిగ్ బాస్ హౌస్‌లో న‌డుస్తున్న‌ లవ్ ట్రాక్ కూడా బుల్లితెర వీక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా మోనాల్, అఖిల్, అభిజిత్ మధ్య ట్రయాంగిల్‌ స్టోరీ రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది.

అయితే ఇలాంటి త‌రుణంలో వీరి ట్రయాంగిల్‌ స్టోరీలోకి అవినాష్ వ‌చ్చి మ‌రింత ర‌చ్చ చేస్తున్నారు.ముఖ్యంగా హౌస్‌లోకి వ‌చ్చిన రోజే మోనాల్‌తో పులిహోర క‌లిపేందుకు ప్ర‌య‌త్నించారు అవినాష్‌.

ఈ క్ర‌మంలోనే అవినాష్ ప్ర‌తి విష‌యంలో మోనాల్ పేరు తీసుకువ‌చ్చేవాడు.దీంతో మోనాల్ బాగా హ‌ట్ అయ్యి.

అవినాష్‌కు కాస్త కంట్రోల్‌లో ఉండాల‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.అయితే తాజాగా అవినాష్, మోనాల్ క‌థ‌లో సూప‌ర్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

మొద‌ట్లో తిట్టిన మోనాల్.‌ మెల్లమెల్లగా అవినాష్‌ జోకులకు అట్రాక్ట్ అవుతోంది.

అంతేకాకుండా.నీ వాయిస్‌లో బేస్ ఉందని అవినాష్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తోంది.

దీంతో నా మాటలు హార్ట్‌లో నుంచి వస్తాయని చెబుతూ మోనాల్‌తో మ‌సాలా పులిహోర క‌ల‌ప‌డానికి ప్ర‌య‌త్నించారు.అంతేకాకుండా.హలో గురూ ప్రేమకోసమేరా జీవితం అంటూ పాట అందుకోవడంతో పాటు.మొనాల్ సో బ్యూటిఫుల్ అంటూ సోప్ వేసి ఖుషీ చేశారు.

ఏదేమైనా అఖిల్‌, అభిజిత్‌ల‌ను మించిపోయిన అవినాష్‌.త‌న మాట‌ల‌తో హార్ట్‌ను గట్టిగానే టచ్ చేస్తున్నాడ‌ని చెప్పాలి.

మ‌రి వీరి క‌థ ఇంకెంత గ‌రం గ‌రంగా మారుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube