ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన డాక్టర్ పిల్ల!

ఎవరు డాక్టర్ పిల్ల అనుకుంటున్నారా? ఇంకా తెలిలేదా? సాయి పల్లవి అండి.సాయి పల్లవి డాక్టర్ ప్లస్ డ్యాన్సర్ ప్లస్ యాక్టర్ కదా! మొదట ఈటీవి ఢీ షో లో డ్యాన్సర్ గా పరిచయం అయిన సాయి పల్లవి ఇప్పుడు స్టార్ హీరోయిన్.

 Actresssai Pallavi Demands 2cr Remuneration, Sai Pallavi, Hero Nani, Two Crores-TeluguStop.com

మధ్యలో డాక్టర్ చదువు కూడా చదివింది అనుకోండి!

అలా డ్యాన్స్ చేస్తూనే కొన్ని కమర్షియల్ అడ్వేర్టైజ్మెంట్స్ చేసి.ఆతర్వాత మళయాళం చిత్రం అయిన ప్రేమమ్ లో లెక్చరర్ గా నటించి కుర్రాళ్ళ మనసును సొంతం చేసుకుంది సాయి పల్లవి.

మలయాళంలో సినిమా రిలీజ్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అందుకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో తెలంగాణ అమ్మాయిగా నటించి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది సాయి పల్లవి.

ఇక ఆతర్వాత ఆమె మంచి అద్భుతమైన నటనతో నాచురల్ స్టార్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది.ఆమె నటన ముందు ఎవరైనా సరే తగ్గాల్సిందే.అందుకే సాయి పల్లవికి అతి తక్కువ సమయంలో మంచి మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయ్.అలానే హీరో నానితో కలిసి కూడా నటించింది.

ఇక ఇప్పుడు మరోసారి నాని తో సినిమా తీయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయ్.

టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా శ్యామ్ సింగ రాయ్‌ సినిమాలో హీరోయిన్ కోసం సాయి పల్లవిని సంప్రదించారట.

అయితే ఆమెకు కథ నచ్చడంతో ఆమె ఒకే చెప్పిందట.ఇక ఇందులో సాయి పల్లవి పాత్ర కాస్త నెగటివ్ గా ఉండనుందట.అంత ఒకే అయినప్పటికి ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీస్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.ఎంత అనుకుంటున్నారా? ఏకంగా 2 కోట్ల రూపాయిలు ఆమె సినిమా కోసం డిమాండ్ చేసిందట.మరి నిర్మాత అంత రెమ్యూనరేషన్ ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube