పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి సెన్షేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి పవన్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది చివరి వరకు పవన్, హరీష్ ల మూవీ పట్టాలెక్కేది.
కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.కరోనా కారణంగా వకీల్ సాబ్ కూడా ఇంకా పవన్ పూర్తి చేయలేదు.
ఆ తర్వాత క్రిష్ మూవీ ఇంకా లైన్ లో ఉంది.ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వాలంటే ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి.
వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాల షూటింగ్ కు పవన్ హాజరు కాబోతున్నాడు.
వకీల్ సాబ్ కోసం నెల రోజులు ఆ తర్వాత క్రిష్ మూవీ కోసం కనీసం అయిదు నుండి ఆరు నెలలు సమయం పడుతుంది.
ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ మూవీ రీమేక్ లో నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి.ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిన తర్వాత అప్పుడు హరీష్ శంకర్ కు ఛాన్స్ రావచ్చు అంటున్నారు.
కనుక ఆయన మరో సినిమాకు కమిట్ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇప్పటికే ఆయన చివరి సినిమా గద్దల కొండ గణేష్ వచ్చి చాలా నెలలు అవుతోంది.
పవన్ ఫ్రీ అవ్వడానికి ఏడాదిన్నర పట్టే అవకాశం ఉంది.కనుక హరీష్ శంకర్ చిన్నదో పెద్దదో మరో సినిమాను మొదలు పెట్టడం అన్ని విధాలుగా మంచిది అని ఆయన అభిమానులు అంటున్నారు.
క్రిష్ పవన్ తో మూవీ ఆలస్యం అవుతున్న కారణంగా వైష్ణవ్ తేజ్ తో కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెల్సిందే.అలాగే హరీష్ చేస్తే బాగుంటుందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.