ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రోజురోజుకీ అనేక కొత్త పుంతలు తొక్కుతోంది.మానవాళికి మరింత సులువుగా సౌకర్యాలు చేకూర్చడానికి టెక్నాలజీ పరంగా అనేక ఉత్పత్తులను కనుగొంటున్నారు.
ఇక స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం మరింతగా పెరిగింది.
భారత్ లాంటి దేశాలలో ఇంటర్నెట్ తక్కువ రేట్ కి లభించడంతో ప్రతి ఒక్కరు రోజుకి డేటాను తెగ వాడేస్తున్నారు.ఇక ఓటిటి ఫ్లాట్ ఫామ్ మరింత పెరిగిన తర్వాత వీడియో కంటెంట్ చూడడానికి ఇంటర్నెట్ ను మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అది కూడా బాగా ఫాస్ట్ గా ఉండే నెట్వర్క్ ను ఉపయోగించడానికి వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.
ఎప్పుడైనా సరే క్వాలిటీ వీడియో చూడాలంటే హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటే వాటిని వీక్షించగలరు.
అంతేకాకుండా ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా సమయం కూడా పడుతుంది.అయితే ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు పరిశోధనలు జరుపుతూనే ఉంటారు.
ఇక తాజాగా లండన్ పరిశోధకులు హై స్పీడ్ ఇంటర్నెట్ వేగాన్ని మరింతగా పెంచారు.వారి పరిశోధనలలో భాగంగా టేరా బైట్స్ స్పీడ్ తో పనిచేసే ఇంటర్నెట్ పై పరిశోధనలు చేశారు.
ఈ పరిశోధనలో భాగంగా వారు కేవలం ఒక సెకనుకి ఏకంగా 1,78,000 జీబీ స్పీడును ట్రాన్స్ఫర్ చేసేలా దానిని రూపొందించారు.
అయితే ఇంతవరకు ఆస్ట్రేలియా దేశంలో అత్యధిక వేగంగా ఉన్న 44.2 టేరా బైట్స్ స్పీడ్ ఉండగా ఆ రికార్డును తాజాగా లండన్ లోని యూనివర్సిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు రికార్డు బద్దలు చేసారు.ఇదివరకు ఉన్న రికార్డుకు ఏకంగా నాలుగింతల వేగమైన ఇంటర్నెట్ ను తాజాగా వారు కనుగొన్నారు.
ఇక ఈ స్థాయికి డేటా స్పీడ్ అందించడానికి పరిశోధకులు ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ ను ఉపయోగించే బదులు హై రేంజ్ కలిగిన నెట్ వ్యవస్థను ఉపయోగించారు.అంతేకాకుండా సిగ్నల్ మరింత నాణ్యతగా ఉంచేందుకు కొత్త టెక్నాలజీని పరిశోధకులు ఉపయోగించారు.
భారతదేశంలో సగటున ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీస్ గా ఉండగా, ఇక మన ఇంటర్నెట్ వేగం తో పోలిస్తే ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ కొన్ని వేల రెట్లు అధికం.