తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని జలవివాదంపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలకు శనివారం లేఖను రాశాడు.
రెండు రాష్ట్రాల్లో ఎవరూ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవద్దని పేర్కొన్నారు.రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, పెండింగ్ లో ఉన్న అంశాలను అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీ ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
నీటి వివాదంతో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్రం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది.
అయితే, ఈ జలవివాదంపై చర్చించడానికి ఈ నెల 5న అపెక్స్ కమిటీ భేటీ అవ్వాల్సి ఉండేది.కానీ సీఎం కేసీఆర్ కొన్ని పనుల కారణంగా రానని చెప్పారు.
దీంతో సమావేశం వాయిదా పడింది.కేంద్ర మంత్రి రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాయడంతో వివాదం సద్దుమణిగినట్లు అయింది.
దీంతో త్వరలోనే అపెక్స్ కమిటీ భేటీ ఉంటుందని పలువురు తెలుపుతున్నారు.దీంతో పాటుగా శ్రీశైలం ఎడమ గట్టు వద్ద తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీంతో తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలో ఆదేశాలు పాటించాలని లేఖలో ఆదేశించింది.